కృష్ణుడి పాత్రల్లో మెప్పించిన నందమూరి హీరోలు వీళ్లే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. నందమూరి హీరోలు నటించిన సినిమాలు సక్సెస్ సాధిస్తూ నిర్మాతలకు మంచి లాభాలను అందిస్తున్నాయి. ఈరోజు కృష్ణాష్టమి అనే సంగతి తెలిసిందే. రాముడు అయినా కృష్ణుడు అయినా తెలుగు రాష్ట్రాల ప్రజలకు సీనియర్ ఎన్టీఆర్ రూపం గుర్తొస్తుంది. సీనియర్ ఎన్టీఆర్ శ్రీ కృష్ణుని పాత్రలో నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి. ఎన్టీఆర్ న్యాయం చేసిన స్థాయిలో కృష్ణుడి పాత్రకు మరెవరూ న్యాయం చేయలేరని చాలామంది భావిస్తారు.

పదుల సంఖ్యలో సినిమాలలో సీనియర్ ఎన్టీఆర్ కృష్ణుడి పాత్రలో నటించడం గమనార్హం. ఈ స్థాయిలో కృష్ణుడి పాత్రలలో నటించిన హీరోలు అరుదు అనే చెప్పాలి. సీనియర్ ఎన్టీఆర్ కొడుకు హరికృష్ణ శ్రీ కృష్ణావతారం సినిమాలో కృష్ణుడి రోల్ లో నటించి మెప్పించారు. స్టార్ హీరో బాలకృష్ణ సైతం పలు సినిమాలలో కృష్ణుడి రోల్ లో నటించారు. శ్రీ కృష్ణార్జున విజయం, పాండు రంగడు సినిమాలలో బాలకృష్ణ కృష్ణుడి పాత్రలో నటించారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బృందావనం సినిమాలో మోడ్రన్ కృష్ణునిగా కనిపించారు. రాబోయే రోజుల్లో తారక్ కృష్ణుని పాత్రలో కనిపించే ఛాన్స్ అయితే ఉంది. ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు అయిన మాస్టర్ ఎన్టీఆర్ చిన్నపిల్లలతో తెరకెక్కిన దానవీర శూరకర్ణ సినిమాలో కృష్ణుడి రోల్ లో నటించారు. కృష్ణుడి పాత్రల ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో మరే ఫ్యామిలీకి దక్కని అరుదైన ఘనత నందమూరి కుటుంబానికి సొంతమైంది.

నందమూరి హీరోల భవిష్యత్తు ప్రాజెక్ట్ లు సైతం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాలని అభిమానులు భావిస్తున్నారు. బాలయ్య గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో నటిస్తుండగా తారక్ కొరటాల శివ డైరెక్షన్ లో నటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ ప్రస్తుతం డెవిల్, బింబిసార2 సినిమాలలో నటిస్తున్నారు. నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనే సంగతి తెలిసిందే.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus