Nandamuri Kalyan Ram: కళ్యాణ్ రామ్ లైనప్ బాగుంది.. వర్కౌట్ అయితే..!
- August 28, 2024 / 10:15 AM ISTByFilmy Focus
కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) ‘బింబిసార’ (Bimbisara) తో తన రేంజ్ పెంచుకున్నాడు. ఆ సినిమాతో అతని మార్కెట్ డబుల్ అయ్యింది. ఆ తర్వాత అతను చేసిన ‘అమిగోస్’ (Amigos) ‘డెవిల్’ (Devil) బాగానే ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయాయి. కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. సీనియర్ నటి విజయశాంతి (Vijayashanthi) ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ‘మెరుపు’ అనే టైటిల్ ను ఈ చిత్రం కోసం అనుకుంటున్నారు.
Nandamuri Kalyan Ram

దాదాపు ఇది ఫిక్స్ అయినట్టే..! గతంలో రాంచరణ్ (Ram Charan) సినిమా కోసం అనుకున్న టైటిల్ అది. కానీ తర్వాత ఎవ్వరూ దానిపై దృష్టి పెట్టలేదు. మొత్తానికి ఇప్పుడు కళ్యాణ్ రామ్ సినిమాకి ఫిక్స్ చేశారు. త్వరలోనే అనౌన్స్మెంట్ ఇస్తారు. మరోపక్క కళ్యాణ్ రామ్ నెక్స్ట్ సినిమా గురించి కూడా ఓ ఆసక్తికర వార్త ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. సుకుమార్ (Sukumar) శిష్యుడు అయినటువంటి పలనాటి సూర్య ప్రతాప్ (Palnati Surya Pratap) అందరికీ సుపరిచితమే.

గతంలో ఇతను ‘కుమారి 21 ఎఫ్’ (Kumari 21F) ’18 పేజెస్’ (18 Pages) వంటి సినిమాలు డైరెక్ట్ చేశాడు. రెండు కూడా బాగా ఆడాయి. ఇటీవల సూర్య ప్రతాప్.. కళ్యాణ్ రామ్ ని కలిసి ఓ కథ వినిపించాడట. అది డిఫరెంట్ గా ఉండటం.. కళ్యాణ్ రామ్ కి కూడా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేసినట్టు తెలుస్తుంది. ‘మెరుపు’ కంప్లీట్ అయ్యాక కళ్యాణ్ రామ్ చేసే సినిమా ఇదే అవుతుంది. ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ పై కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలు ఉన్నాయి.












