Enno Ratrulosthayi Song : బాలయ్య ‘ధర్మక్షేత్రం’ సాంగ్ రీమిక్స్‌తో కళ్యాణ్ రామ్ మరో సూపర్ హిట్ కొడతాడా?

  • January 31, 2023 / 08:10 PM IST

నందమూరి కళ్యాణ్ రామ్ ‘అతనొక్కడే’ మూవీతో కెరీర్‌లో ఫస్ట్ సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి నిర్మాతగానూ మారాడు. అప్పటినుండి కంటెంట్ ఓరియంటెడ్ ఫిలింస్ చేస్తూ.. నటుడిగానే కాకుండా ప్యాషనేట్ ప్రొడ్యూసర్‌గానూ పేరు తెచ్చుకున్నాడు. ‘ఓం 3డి’ లాంటి ప్రయోగాలు, ‘కిక్ 2’ వంటి కమర్షియల్ చిత్రాలతో దెబ్బ తిన్నా కానీ డిఫరెంట్ సినిమాలు ప్రేక్షకులకందించాలని ఆరాటపడుతుంటాడు. ఇటీవల ‘బింబిసార’ తో కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న కళ్యాణ్ రామ్..

మైత్రీ మూవీస్ సంస్థలో ‘ఎమిగోస్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రాజేంద్ర రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతుండగా.. కళ్యాణ్ రామ్ మూడు డిఫరెంట్ క్యారెక్టర్లలో కనిపించనున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్, ఫస్ట్ లిరికల్ సాంగ్ ఆకట్టుకున్నాయి. ఒకరికొకరు సంబంధం లేని, ఒకేలా ఉండే ముగ్గురు వ్యక్తుల జీవితాల్లో ఏం జరిగిందనేది కథ అంటూ అంచనాలు పెంచేశారు టీం. ఇదిలా ఉంటే.. అనిల్ రావిపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ..

నిర్మించిన ‘పటాస్’ మూవీలో బాబాయ్ బాలయ్య ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’ లోని ‘అరే ఓ సాంబ’ సాంగ్ రీమిక్స్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ‘ఎమిగోస్’ కోసం బాలయ్య ‘ధర్మక్షేత్రం’ లోని ఎవర్ గ్రీన్ సాంగ్ ‘ఎన్నోరాత్రులొస్తాయి గానీ’ రీమిక్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. మ్యాస్ట్రో ఇళయరాజా ట్యూన్‌కి వేటూరి సుందరరామ మూర్తి లిరిక్స్ రాయగా.. ఎస్పీ బాలు, చిత్ర అద్భుతంగా పాడారు. రీసెంట్‌గా వీడియో సాంగ్ రిలీజ్ చేశారు.

ఎస్పీ చరణ్, సమీర భరద్వాజ్ పాడారు. ఈ పాట కోసం బ్యూటిఫుల్ సెట్స్ వేశారు. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ బాగుంది. కళ్యాణ్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్‌లో సరికొత్తగా కనిపించాడు. ఒక్క పాట కోసమే చాల భారీగా ఖర్చు చేశారు నిర్మాతలు నవీన్, రవి శంకర్. ‘పటాస్’ లో బాబాయ్య సాంగ్ రీమిక్స్.. ఫలితం సూపర్ హిట్.. ‘ఎమిగోస్’ లోనూ రీమిక్స్ కాబట్టి ఇది కూడా పక్కా హిట్ అవుతుందంటున్నారు నందమూరి ఫ్యాన్స్..

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus