Nandamuri Mokshagna: దర్శకులు మారుతున్నారు.. హీరో రెడీగా లేడా?

  • September 9, 2022 / 02:12 PM IST

నందమూరి వారసుడు మోక్షజ్ఞ టాలీవుడ్‌ ఎంట్రీ ఎప్పుడు? గత కొన్నేళ్లుగా ఈ విషయమ్మీద చర్చ జరుగుతూనే ఉంది. ఎప్పుడు సినిమా స్టార్ట్‌, దర్శకుడు ఎవరు అని బాలకృష్ణ ఫ్యాన్స్‌ అడుగుతూనే ఉన్నారు. అదిగో, ఇదిగో అని ఆయన చెబుతూనే ఉన్నారు. ఈ క్రమంలో దర్శకుల పేర్లు చాలావరకు వచ్చి వెళ్లిపోతూనే ఉన్నాయి. అయినా సినిమా ముచ్చట్లు అధికారికంగా ఒక్కటీ రాలేదు. అప్పుడప్పుడు వివిధ సందర్భాల్లో బయటికొస్తున్న మోక్షజ్ఞ ఫొటోలు చూసి.. ‘బాబు ఇంకా రెడీ కాలేదా?’ అనే ప్రశ్న మాత్రం వినిపిస్తోంది.

హీరో అయ్యే ముందు కుర్రాడు ఎంత బరువు, లావు ఉన్నా ఓకే.. వన్స్‌ హీరో అనుకున్నాక ఆ కుర్రాడు సన్నబడాలి, ఫిట్‌గా మారాలి. ఎందుకంటే టాలీవుడ్‌ హీరో అంటే ఓ ఫిజిక్‌, లుక్‌ అలవాటు పడ్డారు. దీంతో మోక్షజ్ఞ ఇంకా ఆ లుక్‌లోకి ఎప్పుడు వస్తాడు అనే ప్రశ్న వస్తూనే ఉంది. మొన్నీ మధ్య అతని పుట్టిన రోజు సందర్భంగా కేక్‌ కట్‌ చేయించిన ఫొటోలు బయటకు వచ్చాయి. అందులో మోక్షజ్ఞ ఇంకా హీరో లుక్‌ రాలేదు. దీంతో సినిమా ఎంట్రీ ఇంకా ఆలస్యం అవుతుందా అని నిట్టూరుస్తున్నారు ఫ్యాన్స్‌.

మరోవైపు మోక్షజ్ఞ కోసం రాహుల్‌ సాంకృత్యాన్‌ ఓ కథ సిద్ధం చేశారు అని చెబుతున్నారు. ఇదొక ల‌వ్ స్టోరీ అని, 2023 ప్ర‌థమార్ధంలో సినిమా ప‌ట్టాలెక్కుతుంద‌ని తెలుస్తోంది. బాల‌య్య‌ అంటేనే మాస్. మరి బాలయ్య కొడుకు తొలి సినిమానే మాస్‌ హీరోగా వస్తాడు అనుకుంటే.. ప్రేమకథతో రావడం ఏంటి అనే ప్రశ్న వినిపిస్తోంది. అయితే ప్రేమ కథే, మాస్‌ అంశాలతో ఉంటుంది అని కూడా అంటున్నారు.

అంతకుముందు బోయపాటి శ్రీను, అనిల్‌ రావిపూడి పేర్లు కూడా ఇలానే వినిపించాయి. కానీ వాళ్లిద్దరి పేర్లు ఇప్పుడు రావడం లేదు. అయితే బాలకృష్ణనే తన కొడుకు తొలి సినిమాకు దర్శకత్వం వహిస్తారు అనే మాట కూడా వినిపిస్తోంది. మరి ఇందులో ఏది నిజం అవుతుంది. మోక్షజ్ఞ సినిమా ఎప్పుడు ఉంటుంది అనేది చూడాలి. అయితే ‘ఆదిత్య 999’తో మోక్షజ్ఞ ఎంట్రీ ఉండొచ్చు అని ఆ మధ్య బాలయ్య చెప్పినట్లు గుర్తు. మరి ఆ తర్వాత దాని గురించి ఏమీ చెప్పలేదు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus