ఘనంగా ఎన్టీఆర్ మేనల్లుడి పెళ్లి.. ఫోటోలు వైరల్.!

దివంగత నటుడు నందమూరి హరికృష్ణకి నలుగురు సంతానం అనే సంగతి తెలిసిందే. వాళ్ళే జానకి రామ్, కళ్యాణ్ రామ్, సుహాసిని, జూనియర్ ఎన్టీఆర్. జానకి రామ్ ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఇక హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని గురించి చాలా తక్కువమందికే తెలిసుంటుంది. 2018లో తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఈమె తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశారు.

కూకట్ పల్లి నియోజకవర్గం నుండీ ఈమె పోటీ చేయడం జరిగింది. ఇక (Nandamuri Suhasini) సుహాసిని గారికి తమ్ముళ్లు, కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లు అంటే చాలా ఇష్టం. తమ్ముళ్ళకి కూడా వాళ్ళ అక్క అంటే చాలా ఇష్టం. ఇదిలా ఉండగా.. నందమూరి సుహాసిని గారి భర్త పేరు శ్రీకాంత్. ఈ దంపతులకి ఓ కొడుకు ఉన్నాడు. అతని పేరు శ్రీ హర్ష.మార్చి లో శ్రీహర్ష ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే.

నిన్న అంటే ఆగస్టు 20 న అతని వివాహం హైదరాబాద్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరిగింది. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లు దగ్గరుండి తమ మేనల్లుడి పెళ్లిని ఘనంగా జరిపించారు. ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు ఈ పెళ్లి వేడుకకు వచ్చి వధూవరులను ఆహ్వానించారు. ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక లేట్ చేయకుండా మీరు కూడా ఓ లుక్కేయండి :

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus