మహేష్ కి కొత్త పేరు పెట్టిన ఆ డైరక్టర్ ఎవరు ?
- December 9, 2016 / 12:00 PM ISTByFilmy Focus
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్స్ తనయులను బాబు అని పిలవడం అలవాటు. డైరక్టర్లు, అసిస్టెంట్ డైరక్టర్లు అందరూ అలానే పిలుస్తుంటారు. సూపర్ స్టార్ కృష్ణ అబ్బాయిగా మహేష్ బాబు చిత్ర సీమలో అడుగు పెట్టినప్పుడు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు నుంచి ప్రిన్స్ తో పని చేసిన చాలా మంది “బాబు” అని సెట్స్ లో మాట్లాడేవారు. అయితే ఒక డైరక్టర్ మాత్రం ఆయన్ను బాబు అని పిలడానికి ఇష్టపడలేదు. వారు ఎవరో కాదు మహిళా డైరక్టర్ నందిని రెడ్డి. ఆమె కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్ డైరక్టర్ గా ఉన్నప్పుడు మురారి సినిమాకు మహేష్ తో కలిసి పనిచేశారు. అప్పుడు తోటి సహాయ దర్శకులు ప్రిన్స్ ని బాబు అని పిలుస్తుంటే నందిని మాత్రం అలా పిలిచేందుకు ఇష్టపడలేదంట.
ఆ విషయాన్నీ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో ఆమె వెల్లడించారు. “మహేష్ నాతో ఫ్రెండ్లీగా ఉండేవారు. నన్ను నందిని అని కాకుండా “హిని” అని పిలిచేవారు. అందుకు నేను కూడా అతన్ని “హేష్” అని పిలవడం మొదలు పెట్టాను. అందుకు మహేష్ కూడా ఎప్పుడూ ఇబ్బంది పడలేదు” అని ఆనాటి సంగతులను గుర్తుచేసుకున్నారు. “అలా మొదలయింది” అనే చిత్రం ద్వారా డైరక్టర్ గా మారిన నందిని తొలి చిత్రం తో విజయాన్ని సొంతం చేసుకుంది. ఆమె దర్శకత్వంలో వచ్చిన జబర్దస్త్ నిరాశ పరిచినా, కల్యాణవైభోగమే మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాణ సంస్థలో ఓ మూవీ చేసే పనిలో బిజీగా ఉన్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















