బైక్ పై చక్కర్లు కొట్టిన నాని, సాయి పల్లవి
- August 30, 2017 / 11:30 AM ISTByFilmy Focus
డబల్ హ్యాట్రిక్ హిట్ తో దూసుకుపోతున్న హీరో నాని, ఒకే ఒక సినిమాతో అందరికి దగ్గరైన నటి సాయి పల్లవి. వీరిద్దరూ కలిసి బైక్ పై షికారు చేసారు. అభిమాన తారలు కళ్ళెదురుగా ఉండేసరికి అభిమానులు చూసేందుకు ఎగబడ్డారు. ఈరోజు ఉదయం హన్మకొండ గ్రీన్ స్క్వేర్ ప్లాజా సమీపంలో ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి ) సినిమా షూటింగ్ జరిగింది. దర్శకుడు వేణు శ్రీరాం… నాని, సాయి పల్లవిలపై ఓ రొమాంటిక్ సీన్ తెరకెక్కించారు. ఈ సమయంలో ఫ్యాన్స్ వీరిని చూడడంతో అక్కడ సందడి నెలకొనింది.
దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. మరికొన్ని రోజుల్లో ప్రొడక్షన్ వర్క్ పూర్తి అవుతుందని చిత్ర బృందం వెల్లడించింది. నాని ప్రేమ కథ చిత్రాల్లో మిడిల్ క్లాస్ అబ్బాయి ప్రత్యేకమని వివరించింది. దీని తర్వాత నాని తర్వాత యువ దర్శకుడు మేర్లపాక గాంధీ తో “కృష్ణార్జున యుద్ధం” చేయనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















