Nani: ఆ సినిమాలతో పోలిక.. ‘దసరా’ గురించి నాని వైరల్‌ కామెంట్‌!

  • March 18, 2023 / 11:48 AM IST

‘దసరా’ సినిమా ట్రైలర్‌ వచ్చింది ఆలస్యం.. ఎక్కడ చూసినా ఒకటే మాట. ఇదేదో పాన్‌ ఇండియాల సినిమాల మిక్సింగ్‌. ఒకరు కాదు, ఇద్దరు కాదు చాలామంది నెటిజన్లు ఈ మేరకు కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ మాటలకు నాని కామెంట్ చేశాడు. దీంతో ఆయన మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. సోషల్‌ మీడియాలో ఈ సినిమా గురించి యూనిట్ సభ్యులు భారీగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో నెటిజన్ల ప్రశ్నలకు నాని ట్విట్టర్ లో ఆస్క్ నాని అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగానే ఈ మిక్సింగ్‌ అనే అంశంపై స్పందించాడు.

‘దసరా’ సినిమాలో నాని లుక్, కథా నేపథ్యం, సినిమా లుక్‌ చూస్తుంటే ఇటీవల కాలంలో భారీ విజయాలు అందుకున్ పాన్‌ ఇండియా సినిమాలు అన్నీ కలిపి తీసినట్లు ఉంది అని అంటున్నారు. నిజానికి ‘దసరా’ సినిమాలో లుక్ బయటకు వచ్చినప్పుడు ‘పుష్ప’, ‘రంగస్థలం’ సినిమాల్లో హీరోల పాత్రలు గుర్తొచ్చాయి చాలామందికి. ఆ రెండు సినిమాలను పోలి ఈ సినిమా ఉంటుందేమో అని కూడా అన్నారు. ఇప్పుడు ట్రైలర్‌ వచ్చాక ఆ పుకార్లు ఇంకా పెరిగాయి. ఇంకొందరు అయితే ‘కేజీయఫ్‌’ తరహాలో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.

సినిమా గురించి వస్తున్న పుకార్ల విషయంలో క్లారిటీ ఇవ్వాలంటూ ఓ నెటిజన్‌ ట్వీట్ చేయగా నాని స్పందించాడు. ‘టెర్మినేటర్‌’, ‘డిడిఎల్‌జే’ ఒకేలా ఉండవు కదా. కానీ షారుఖ్‌ ఖాన్‌, ఆర్నాల్డ్‌ ఆయా సినిమాల్లో జాకెట్‌ ధరిస్తారు కదా అని సమాధానం ఇచ్చాడు. కాస్ట్యూమ్స్ ఒకేలా ఉన్నా సినిమాలు భిన్నంగా ఉంటాయి కదా నాని అన్నాడు. దీంతో లుక్‌ ఒకలా ఉన్నా.. సినిమాలు ఒకటి కావు అని నాని క్లారిటీ ఇచ్చినట్లు అయ్యింది.

దీంతో ఈ సినిమా విషయంలో క్లారిటీ వచ్చినట్లు వచ్చీ.. మళ్లీ పోయింది అని చెప్పొచ్చు. అయితే ఒకటే విషయం. ఇక్కడ ‘దసరా’ సినిమా విషయంలో లుక్‌ మాత్రమే కాదు ఫీల్‌ కూడా అలానే ఉంది. ‘కేజీయఫ్‌’ బ్యాగ్రౌండ్‌, ‘రంగస్థలం’ గ్రామీణ నేపథ్యం, ‘పుష్ప’ లుక్ కనిపిస్తున్నాయి. చూద్దాం ఈ సినిమా సంగతి ఏమవుతుందో. అయితే దీని కోసం ఈ నెల 30 వరకు ఆగాలి.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus