నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం హాయ్ నాన్న సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ తన సినిమాల గురించి అలాగే వ్యక్తిగత విషయాల గురించి అభిమానులకు తెలియజేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నానికి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.
దసరా లాంటి ఒక మాస్ సినిమా చేసిన తర్వాత హాయ్ నాన్న అంటూ మరొక క్లాస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి కారణం ఏంటి అంటూ ప్రశ్నించారు ఈ ప్రశ్నకు ఈయన మెగాస్టార్ చిరంజీవి సినీ కెరియర్ ను ఉదాహరణగా చెబుతూ పలు విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు ఖైదీ సినిమా తర్వాత అన్ని మాస్ సినిమాలే కనుక చేసి ఉంటే ఆయన ఈ స్థాయికి వచ్చేవారు కాదని
ఆయన అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి విభిన్న కథా చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారని తెలియజేశారు. ఇక చిరంజీవి గారితో నన్ను నేను పోల్చుకోవడం లేదని కేవలం ఉదాహరణగా మాత్రమే చెప్పానని తెలిపారు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నేనేదో పెద్ద నటుడు అవుదాం అనుకొని ఇక్కడికి రాలేదని పెద్ద స్టార్ కావాలనే కోరిక నాకు లేదని,
నేను చేసే ఏ సినిమా అయినా కూడా కొంతకాలం పాటు ప్రేక్షకులు ఆ సినిమాని గుర్తు పెట్టుకుంటే చాలు అంటూ నాని (Nani) తన సినీ కెరియర్ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.