నేచురల్ స్టార్ నాని (Nani) మిడ్ రేంజ్ హీరోల్లో నెంబర్ 1 ప్లేసు కోసం కష్టపడుతున్నాడు. అయితే ఇతనికి విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) గట్టి పోటీ కూడా ఇస్తున్నాడు. నాని సినిమాలపై ఆడియన్స్ లోనే కాదు ట్రేడ్ వర్గాల్లో,డిస్ట్రిబ్యూటర్స్ లో కూడా గట్టి నమ్మకం ఉంటుంది. మినిమం గ్యారెంటీ హీరో అనే ముద్ర నానిపై ఉంది. నానిలో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే.. కన్సిస్టెంట్ గా హిట్లు కొడుతున్నాడు. దీంతో స్టార్ హీరోలకి కూడా ఒక రకంగా చెమటలు పట్టిస్తున్నాడు అనే చెప్పాలి.
ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే.. అతనికి నాని కంటే క్రేజ్ ఎక్కువే. కటౌట్ కూడా అతనికి మేజర్ ప్లస్ పాయింట్. కాకపోతే నాని మాదిరి కన్సిస్టెంట్ గా హిట్లు కొట్టలేకపోతున్నాడు. ‘టాక్సీ వాలా’ (Taxiwaala) తర్వాత విజయ్ ఖాతాలో ఒక్క హిట్టు కూడా పడలేదు. ఇదిలా ఉండగా.. నాని నటించిన ‘హిట్ 3’ నిన్న రిలీజ్ అయ్యింది. సినిమాకి మొదటి షోతోనే పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక మొదటి రోజు ఓపెనింగ్స్ కూడా అదిరిపోయాయి.
‘హిట్ 3’ (HIT 3) మొదటి రోజు రూ.43 కోట్లు కలెక్ట్ చేసినట్లు చిత్రబృందం ఓ పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది. ఇది మిడ్ రేంజ్ హీరోల సినిమాల్లో టాప్ ఓపెనింగ్స్ అని చెప్పాలి. రెండేళ్ల క్రితం వచ్చిన నాని ‘దసరా’ (Dasara) కూడా మొదటి రోజు రూ.38 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ రికార్డుని ఇప్పటివరకు ఎవ్వరూ టచ్ చేయలేదు.
అయితే విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ (Kingdom) పై మంచి హైప్ ఉంది. మే 30న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఒకవేళ ఈ సినిమాకి కనుక పాజిటివ్ టాక్ వస్తే కచ్చితంగా భారీ ఓపెనింగ్స్ ను రాబడుతుంది. కానీ ‘హిట్ 3’ రేంజ్ ఓపెనింగ్స్ ను రాబడుతుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న