నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు లు హీరోలుగా అదితి రావ్ హైదరి, నివేదా థామస్ లు హీరోయిన్లుగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘వి’. యాక్షన్ అండ్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని మార్చి 25 న థియేటర్లలో విడుదల చెయ్యాలి అనుకున్నారు నిర్మాత దిల్ రాజు. అయితే కరోనా వైరస్ మహమ్మారి వల్ల థియేటర్లు మూతపడటంతో సీన్ రివర్స్ అయ్యింది. 5 నెలలు కావస్తోన్నప్పటికీ… ఇంకా థియేటర్లు తెరుచుకోకపోవడం….
అందులోనూ ఆర్ధిక లావాదేవీల కారణంగా… ‘వి’ చిత్రాన్ని సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ లో విడుదల చెయ్యబోతున్నారు. ‘వి’ చిత్రానికి నిర్మాత దిల్ రాజు 40 కోట్ల బడ్జెట్ పెట్టారు. థియేట్రికల్ రైట్స్ ను 30 కోట్లకు అమ్మారు. కానీ థియేటర్లు తెరుచుకోకపోవడం వల్ల వాళ్లు డబ్బులు వెనక్కి ఇవ్వాలి అని డిమాండ్ చెయ్యడంతో దిల్ రాజు ‘అమెజాన్ ప్రైమ్’ కు ‘వి’ ను ఇచ్చేసినట్టు సమాచారం. అమెజాన్ ప్రైమ్ వారు ‘వి’ ని 32 కోట్లకు కొనుగోలు చేసారట.
క డబ్బింగ్ మరియు శాటిలైట్ రైట్స్ కు మరో 15 కోట్లకు ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. ఆ రకంగా స్వల్ప లాభాలతో ‘వి’ నిర్మాత దిల్ రాజు గట్టెక్కినట్టు సమాచారం. ఒకవేళ థియేటర్లు తెరుచుకునే పరిస్ధితి వస్తే… ‘వి’ చిత్రాన్ని 5 కోట్లకు సింగిల్ స్క్రీన్స్ లో విడుదల చేసుకోవడానికి అమెజాన్ ప్రైమ్ వారితో ఒప్పందం కుదుర్చుకున్నాడట దిల్ రాజు.