Nara Brahmani: వైరల్ అవుతున్న నారా బ్రాహ్మణి షాకింగ్ కామెంట్స్!

సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటు ఒక సినిమాను మించి మరొకటి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరసింహారెడ్డి సినిమాను థియేటర్ లో చూసిన నారా బ్రాహ్మణి ఈ సినిమా గురించి స్పందిస్తూ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీరసింహారెడ్డి సినిమా గురించి, సినిమాలో బాలయ్య చెప్పిన డైలాగ్స్ గురించి నారా బ్రాహ్మణి స్పందిస్తూ షాకింగ్ కామెంట్లు చేశారు.

నాన్నగారి ఫ్యాన్స్ తో కలిసి వీరసింహారెడ్డి మూవీ చూశానని ఈ సినిమా చూడటం తనకు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తోందని నారా బ్రాహ్మణి అన్నారు. ప్రతి సంక్రాంతికి నాన్నగారు కానుక ఇస్తారని ఈసారి వీరసింహారెడ్డి సినిమాను ఇచ్చారని నారా బ్రాహ్మణి వెల్లడించారు. నాన్నగారు సినిమాలో రెండు పాత్రలు పోషించారని సినిమాలో రెండు పాత్రలు పోటాపోటీగా ఉన్నాయని నారా బ్రాహ్మణి చెప్పుకొచ్చారు. సినిమాలో నాన్నగారి డైలాగ్ డెలివరీ బాగుందని నాన్నగారు డైలాగ్స్ చెప్పినట్టుగా ఇండియాలో ఎవరూ డైలాగ్స్ చెప్పలేదని నారా బ్రాహ్మణి కామెంట్లు చేశారు.

నారా బ్రాహ్మణి చేసిన కామెంట్లు ఫ్యాన్స్ కు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తుండటం గమనార్హం. నారా బ్రాహ్మణి ప్రస్తుతం వ్యాపారవేత్తగా బిజీగా ఉన్నారు. బాలయ్య తర్వాత సినిమా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కనుంది. బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీ కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మాస్ సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్న బాలయ్య ఆ సినిమాలతో వరుస విజయాలను సొంతం చేసుకుంటూ విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

బాలయ్య సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరగడంతో పాటు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. గతంతో పోల్చి చూస్తే బాలయ్య మార్కెట్ ఊహించని రేంజ్ లో పెరిగిందనే సంగతి తెలిసిందే.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus