‘ధ్రువంగల్ పదినారు’ అనే వైవిధ్యమైన థ్రిల్లర్ కథతో కోలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు కార్తీక్ నరేన్. ఈ సినిమా తీసే సమయానికి కార్తీక్ వయసు కేవలం 21 మాత్రమే. ఈ సినిమాను తెలుగులో ’16’ అనే పేరుతో విడుదల చేయగా.. ఇక్కడ కూడా మంచి సక్సెస్ అందుకుంది. కార్తీక్ టాలెంట్ కి ఫిదా అయిన దర్శకుడు గౌతమ్ మీనన్ అతడి డైరెక్షన్ లో ఓ సినిమాను నిర్మించాడు. అదే ‘నరకాసురన్’.
ఈ సినిమా పూర్తయి చాలా ఏళ్లు కావొస్తుంది. కానీ రిలీజ్ కు మాత్రం నోచుకోలేదు. దానికి కారణం గౌతమ్ మీనన్ ఆర్ధిక వివాదాలే. మూడేళ్లకు పైగా సినిమా విడుదల కాకుండా ఆగిపోయింది. కార్తీక్ నరేన్ డైరెక్ట్ చేసిన మూడో సినిమా ‘మాఫియా’ కూడా విడుదలైంది కానీ ‘నరకాసురన్’కి మాత్రం మోక్షం కలగలేదు. దీంతో ఇక ఈ సినిమా రాదని అందరూ అనుకున్నారు. కానీ ఫైనల్ గా ఈ సినిమాను బయటకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు. ‘సోనీ లైవ్’ ద్వారా ఈ సినిమా ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కార్తీక్ తొలి సినిమా ‘ధ్రువంగల్ పదినారు’కి కొనసాగింపుగా ‘నరకాసురన్’ను తీశాడు కార్తీక్. ఈ సినిమాలో హీరో సందీప్ కిషన్, శ్రియ, అరవింద్ స్వామీ వంటి తారలు నటించారు. అయితే ఈ సినిమాను ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయంలో స్పష్టం లేదు. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది!