తేజ డైరెక్షన్లో వచ్చిన ‘జై’ అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నవదీప్. మొదటి చిత్రం పర్వాలేదనిపించడంతో తరువాత కూడా ‘మొదటి సినిమా’, ‘గౌతమ్ ఎస్.ఎస్.సి’ ‘చందమామ’ వంటి హిట్ చిత్రాల్లో నటించే అవకాశం దక్కించుకున్నాడు. కానీ క్రేజ్ మాత్రం పెద్దగా ఏర్పడలేదు. ఇక అటుతరువాత వచ్చిన సినిమాలు కూడ ప్లాప్ అయ్యాయి. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఆదుకున్నాడు. నవదీప్, బన్నీ ల మధ్య మంచి స్నేహం ఉంది. ఇప్పుడు ‘అల వైకుంఠపురములో’ సినిమాలో కూడా నటిస్తున్నాడు నవదీప్. ఇక నవదీప్ కెరీర్ ప్రారంభంలో అతను ‘గే’ అంటూ కొన్ని రూమర్లు పుట్టుకొచ్చాయి వాటి పై తాజాగా నవదీప్ స్పందించాడు.
‘సినిమాల్లోకి వచ్చిన తరువాత మీపై వచ్చిన పెద్ద రూమర్ ఏంటి’ అన్న ప్రశ్నకు నవదీప్ బదులిస్తూ.. “నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు బాగా డబ్బున్న వాడిని.. నాకు బాగా పొగరెక్కువ అనే ప్రచారం జరిగింది. నాకు అబ్బాయిలంటే ఎక్కువ ఇష్టం. నేను ‘గే’ అనే రూమర్ కూడా క్రియేట్ చేశారు. మరోవైపు అమ్మాయిలతో అదీ ఇదీ అంటూ చెప్తూనే ఉన్నారు. ఇది జరుగుతుండగానే ఎవడో వచ్చి ‘మీకు అబ్బాయిలంటే ఇష్టం అంట కదా’ అని అడిగాడు. వాడికి నేను ఏం చెప్పాలో అర్ధం కాలేదు. కాదురా బాబు అని చెప్తే వాడు నమ్మడు. వాడు ‘నేను అదే’ అని ఫిక్స్ అయ్యాడు. నేను యూఎస్‌లో ఉండగా.. వాడు నాతో చాట్ చేశాడు. నేను సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌ని మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు. మిమ్మల్ని ఒకటి అడుగుతా అన్నాడు. వీడేం అడుగుతాడురా బాబూ అని.. సరే చెప్పు అని అన్నా. ఏం లేదు నాకు అది నిజం అని తెలుసు. మీరు ఒప్పుకోరని తెలుసు.. కాని నేను అడగాలి అన్నాడు. ఫైనల్‌గా మీకు అబ్బాయిలంటే బాగా ఇష్టం అంట కదా.. నేనూ అంతేనండి అని అన్నాడు. మీతో మాట్లాడాలని ఉంది. మీతో నా ఫీలింగ్ పంచుకోవాలని ఉంది అని అన్నాడు. దానికి నేను.. ‘నాకు అబ్బాయిలు ఇష్టమా? అమ్మాయిలు ఇష్టమా? లేక మీకు ఎవరు ఇష్టం అన్నదాన్ని పక్కన పెట్టండి. మీరు ఎవరో నాకు తెలియదు. నీ ఫీలింగ్స్ నాకు చెప్పకు. నాకు ఇంట్రస్ట్ లేదు.. నీ ఫీలింగ్స్‌లో అని బై చెప్పి వాడికో దండం పెట్టేశా…! వాడికి ఏం చెప్పాలో నాకు అర్ధం కాలేదు. చాటింగ్‌లో తప్ప డైరెక్ట్‌గా నన్ను గే అన్నది ఎప్పుడూ లేదు. చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి ఇలాగే అన్నారు. అసలు గే అంటే సినిమాల్లో చూపించినట్టు ఉండరు. చాలా చోట్ల ఉంటారు. కాని.. వాళ్ళ లైఫ్ వాళ్ళది మన లైఫ్ మనది. వాళ్ళతో మనకు ఏం సంబంధం.? సినిమాల్లో చూపించినట్టుగా అబ్బాయిల్ని చూడగానే వచ్చి టచ్ చేసినట్టు అయితే రియల్ లైఫ్‌లో ఉండరు. కామెడీ కోసం అలా వాడతారు. సినిమాల్లో మాత్రమే అలా జరుగుతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు నవదీప్.