‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ‘డి ఫార్ దోపిడి’ ‘1 నేనొక్కడినే’ వంటి చిత్రాలతో నటుడిగా మారిన నవీన్ పోలిశెట్టి ఆ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ మూవీ ఘనవిజయం సాధించింది. అటు తర్వాత ‘జాతి రత్నాలు’ మూవీతో ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు ఈ యంగ్ హీరో. యూత్ లో ఇతనికి మంచి క్రేజ్ ఏర్పడింది.ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడం కోసం దర్శకనిర్మాతలు ఎగబడుతున్నారు.
కొంతమంది నిర్మాతలు అయితే ఇతనికి అడ్వాన్సులు కూడా ఇచ్చేసి ఇతని కాల్ షీట్లు బుక్ చేసుకుంటున్నారు.ఇదే క్రమంలో ఇతను ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వారి చిన బ్యానర్ అయిన ‘సితార ఎంటర్‌టైన్మెంట్స్’ లో కూడా ఓ సినిమా చేయడానికి అడ్వాన్స్ తీసుకున్నాడు. ఆ సినిమాకి గాను ఇతని పారితోషికం రూ.1 కోటో, రూ.2 కోట్లో కాదు ఏకంగా రూ.4 కోట్లు కావడం విశేషం.ఈ ప్రాజెక్టు కోసం కొంత అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు నవీన్.
నితిన్- కీర్తి సురేష్ ల `రంగ్ దే` మూవీకి కో డైరెక్టర్ గా పనిచేసిన వ్యక్తి ఈ ప్రాజెక్టుకి డైరెక్టర్ గా ఎంపికయ్యాడు.నవీన్ కు అతను కథ కూడా చెప్పి ఇంప్రెస్ చేసాడు. కాకపోతే నవీన్ కొన్ని మార్పులు కోరాడు.వాటిని డైరెక్టర్ సరిగ్గా డెవలప్ చేయలేకపోయాడని వినికిడి. దాంతో నవీన్ ఈ ప్రాజెక్టుని పక్కన పెట్టేసినట్టు తెలుస్తుంది.