Nayak Collections: ‘నాయక్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ‘నాయక్’ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఎస్.రాధాకృష్ణ సమర్పణలో ‘యూనివర్సల్ మీడియా’ బ్యానర్ పై డి.వి.వి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. 2013 వ సంవత్సరంలో జనవరి 9న సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ అయ్యింది. పోటీగా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా ఉన్నప్పటికీ కూడా ‘నాయక్’ సినిమా ఘన విజయాన్ని సాధించింది. రాంచరణ్ డబుల్ రోల్ ప్లే చేసిన ఈ మూవీలో బ్రహ్మానందం, దివంగత జయప్రకాష్..ల కామెడీ హైలెట్ గా నిలిచింది అని చెప్పాలి.

బాక్సాఫీస్ వద్ద కూడా ఈ మూవీ మంచి వసూళ్లను సాధించింది. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 11 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ నేపథ్యంలో ‘నాయక్’ ఫైనల్ గా బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 11.75 cr
సీడెడ్ 7.95 cr
ఉత్తరాంధ్ర 5.00 cr
ఈస్ట్ 3.21 cr
వెస్ట్ 2.76 cr
గుంటూరు 3.67 cr
కృష్ణా 2.35 cr
నెల్లూరు 2.04 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 38.73 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 6.10 cr
 ఓవర్సీస్ 2.55 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 47.38 cr (షేర్)

‘నాయక్’ (Nayak) సినిమా రూ.44 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఈ మూవీ ఫుల్ రన్లో రూ.47.38 కోట్ల షేర్ ని రాబట్టింది. రూ.3.38 కోట్ల లాభాలతో ఈ మూవీ హిట్ లిస్ట్ లోకి చేరింది.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus