డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చిత్రం లియో. విజయ్ హీరోగా ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 19వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే మరోవైపు ఈ సినిమా గురించి భారీ స్థాయిలో నెగిటివిటీ కూడా స్ప్రెడ్ అవుతున్నటువంటి నేపథ్యంలో విజయ్ ఫ్యాన్స్ కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమా (LEO Movie) మ్యూజిక్ పరంగా అనిరుద్ ప్రేక్షకులను మెప్పించలేకపోయారు అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. అలాగే ట్రైలర్ లోని కొన్ని అనుచిత వ్యాఖ్యల కారణంగా వివాదం కూడా తలెత్తిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా విషయంలో డైరెక్టర్ హీరో విజయ్ మధ్య కాస్త బేధాభిప్రాయాలు వచ్చాయన్న వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ట్రైలర్ చూసిన తర్వాత విజయ్ కెరియర్లో భారీ డిజాస్టర్ సినిమాగా లియో నిలిచిపోతుంది అంటూ ఈ సినిమా గురించి నెగటివ్ వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే మరొక డైరెక్టర్ ప్రముఖ నటి నయనతార విగ్నేష్ శివన్ సినిమా విషయంలో కాస్త నెగిటివ్ అభిప్రాయాలను కలిగి ఉన్నారని స్పష్టంగా అర్థమవుతుంది. ముందుగా ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఈయనకే వచ్చింది. అనుకొని పరిస్థితులలో ఈయనని తప్పించి లోకేష్ ను తీసుకోవడంతో ఈ సినిమా విషయంలో ఈయన కోపంగా ఉన్నారని అందుకే ఈ సినిమా ఫ్లాప్ అవ్వాలని కోరుకుంటున్నారని తెలుస్తుంది. సినిమా గురించి సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లు వినిపించడంతో ఆ నెగటివ్ పోస్టులపై డైరెక్టర్ విగ్నేష్ లైక్ కొట్టడంతో పెద్ద ఎత్తున ఈ విషయం వివాదాలకు కారణమైనది.
దీంతో పలువురు విజయ్ అభిమానులు ఏంటి మా హీరో సినిమా ఫ్లాప్ అవ్వాలని పూజలు కనుక చేస్తున్నావా అంటూ ఈయనపై మండిపడుతున్నారు. పొరపాటున చెయ్యి తగిలింది అంటూ విగ్నేష్ ఈ విషయం గురించి సంజాయిషీ ఇచ్చినప్పటికీ విగ్నేష్ మాత్రం ఉద్దేశపూర్వకంగానే ఈ సినిమా విషయంలో నెగిటివ్ అభిప్రాయాలను కలిగి ఉన్నారని ,ఈ సినిమా సక్సెస్ అవ్వడం ఈయనకు ఇష్టం లేదని స్పష్టంగా అర్థమవుతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.