Nayani Pavani: స్టేజ్ పైన వెక్కివెక్కి ఏడ్చిన నయనీ..! గంటసేపు ఓదార్చిన బిగ్ బాస్ టీమ్..! ఏం జరిగిందంటే.?

బిగ్ బాస్ హౌస్ లో 6వ వారం నయనీ పావనిీ హౌస్ నుంచీ ఎలిమినేట్ అయిపోయింది. బిగ్ బాస్ 2.ఓ ద్వారా 5వ కంటెస్టెంట్ గా వచ్చిన నయనీ పావనీ గేమ్ ఇరగదీసేద్దామని అనుకుంది. కానీ, ఒకే ఒక్కవారం మాత్రమే ప్రేక్షకులు అవకాశం ఇచ్చారు. దీంతో నామినేట్ అయిన ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోయింది. నిజానికి అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ లో నయనీ పావని సేఫ్ జోన్ లోనే ఉంది. శోభాశెట్టి, అశ్విని , ఇంకా పూజా మూర్తి ఈ ముగ్గురిలో ఒకరు ఎలిమినేట్ అయిపోతారని అంతా అనుకున్నారు.

కానీ, అనూహ్యంగా నయనీ పావని ఎలిమినేషన్ జరిగిపోయింది. అసలు ఎలిమినేషన్ లో ఏం జరిగిందంటే., బిగ్ బాస్ హౌస్ లో ఆరోవారం డేంజర్ జోన్ లో లాస్ట్ వరకూ నయనీ పావని ఇంకా శోభాశెట్టి ఇద్దరూ ఉన్నారు. వీరిలో శోభాశెట్టిని సేఫ్ చేసిన హోస్ట్ నాగార్జున నయనీ పావనీని ఎలిమినేట్ చేశాడు. ఒక్కసారిగా నయనీ ఎమోషనల్ అయ్యింది. వల వలా కన్నీళ్లు పెట్టుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. దీంతో హౌస్ మేట్స్ అందరూ చాలాసేపు ఓదార్చారు.

అంతేకాదు, స్టేజ్ పైకి వచ్చిన తర్వాత కూడా నాగార్జున దగ్గరకి వచ్చి ఏడుస్తూనే ఉంది. ఇక స్టేజ్ పైన చాలా సేపు అలా ఏడుస్తునే బిగ్ బాస్ బజ్ ఇంటర్య్వూకి వెళ్లినట్లుగా సమాచారం. అంతేకాదు, బిగ్ బాస్ బజ్ హోస్ట్ గీతు రాయల్ కూడా నయనీని ఇంటర్య్వూ చేస్తూ బాధపడిందట. అసలు నయనీ పావని అంతలా ఎందుకు ఏడ్చింది. నయనీ పావని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేస్కుంది. లాస్ట్ టైమ్ కెప్టెన్సీలో తనదే కీ రోల్. బజర్ మోగగానే వెళ్లి పిన్ పట్టుకుంది.

ప్రిన్స్ కి ఇచ్చింది. దీంతో ప్రిన్స్ కెప్టెన్ అయ్యాడు. అంతేకాదు, బిగ్ బాస్ ఇచ్చిన ఛాలెంజస్ లో కూడా గేమ్ ని బాగా ఆడింది. ఫాస్టెస్ట్ గేమ్ లో గోల్స్ ని ఆపడంలో సక్సెస్ అయ్యింది. చక్కగా టాస్క్ లని అర్దం చేస్కుంటూ ఇంకా కొన్ని వారాలు ఇంట్లో ఉంటుందనుకునే లోపు ఇలా ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. అందుకే, నయనీ పావనీ కన్నీళ్లు పెట్టుకుంది. అప్పుడే ఎలిమినేట్ అవుతానని అస్సలు ఊహించలేదని చెప్పింది. మొత్తానికి అదీ మేటర్.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus