Balakrishna: టైటిల్ లేదు.. మోక్షజ్ఞ లాంచ్ లేదు.. బాలయ్య ఫ్యాన్స్ అసహనం..!

ఈరోజు ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా బాలకృష్ణ అభిమానులకు స్పెషల్ అప్డేట్స్ ఇవ్వబోతున్నట్లు అధికారిక ప్రకటనలు వచ్చాయి. ‘అఖండ’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న బాలయ్య.. తన నెక్స్ట్ సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నాడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం బాలయ్య కెరీర్లో 107వ చిత్రం. శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. కన్నడ స్టార్ దునియా విజయ్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తుండగా వరలక్ష్మీ శరత్ కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తుంది.

ఆల్రెడీ 40 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా నందమూరి ఫ్యామిలీకి పెద్ద ఫ్యాన్ అయిన బుర్రా సాయి మాధవ్ ఈ చిత్రానికి డైలోగ్స్ రాస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఈ చిత్రం నుండీ అప్డేట్ ఇస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. దీంతో ఈ చిత్రం నుండీ టైటిల్ ను విడుదల చేస్తున్నట్లు అంతా ఆశించారు. కానీ ఓ పోస్టర్ విడుదల చేసి సరిపెట్టారు.

ఈ పోస్టర్లో వైట్ అండ్ వైట్ డ్రెస్ లో ఓ కత్తి పట్టుకుని నిలబడి ఉన్నాడు. ‘సమరసింహా రెడ్డి’ ‘నరసింహ నాయుడు. ‘సింహా’ ‘లెజెండ్’ చిత్రాలను గుర్తు చేసే విధంగానే ఈ పోస్టర్ ఉంది. కానీ మాస్ లుక్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. అయితే టైటిల్ ను మాత్రం మేకర్స్ రివీల్ చేయకపోవడంతో అభిమానులు డిజప్పాయింట్ అయ్యారు.

అలాగే ‘బిటిఆర్(బసవతారక రామ)’ క్రియేషన్స్ బ్యానర్ ను స్థాపించి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు అని ఓ ప్రకటన వచ్చింది. ఇది మోక్షజ్ఞ ఎంట్రీ కోసమేమో అని అభిమానులు ఆశిస్తే నందమూరి చైతన్య కృష్ణ మూవీ అని గాలి తీసేశారు. కాబట్టి ఇలా రెండు రకాలుగా బాలయ్య అభిమానులు నిరాశ చెందారు.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus