మలయాళంలో ఇటీవల రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన చిత్రం ‘ప్రేమలు'(Premalu). ఒరిజినల్ వెర్షన్ నే చాలా మంది తెలుగు ప్రేక్షకులు చూసి సూపర్, బ్లాక్ బస్టర్, కల్ట్ అంటూ కామెంట్స్ చేశారు. అక్కడ ఈ సినిమా రూ.100 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. తెలుగులోకి కూడా ఇటీవల డబ్ చేసి రిలీజ్ చేశారు. రాజమౌళి తనయుడు కార్తికేయ ఈ చిత్రం తెలుగు రైట్స్ ను కొనుగోలు చేసి రిలీజ్ చేయడం జరిగింది.
మార్చి 8 న శివరాత్రి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా ఇక్కడ కూడా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు సాధించింది. బయ్యర్స్ అంతా సో హ్యాపీ.. థియేట్రికల్ గా ఈ మూవీ సూపర్ హిట్ అనిపించుకుంది. తెలుగు వెర్షన్ ఓవర్సీస్లో కూడా భారీ వసూళ్లు సాధించింది. కానీ తాజాగా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమాకి… నెగిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి.
‘ఇదొక ఓవర్ రేటెడ్ మూవీ అని’ ‘అనవసరంగా ఎక్కువ హైప్ ఇచ్చారు అని’ ‘ఇలాంటి సినిమా తెలుగు ఫిలిం మేకర్స్ కనుక చేసుంటే లాజిక్ లేదు, కొత్తదనం లేదు అంటూ పేర్లు పెట్టేవారని’ … ఇలా కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. కథ పరంగా ప్రేమలు కొత్తగా ఏమీ ఉండదు అని నిజమే..! కానీ ప్రతి సన్నివేశం హిలేరియస్ గా ఉంటుంది.
నటీనటుల హావభావాలతో అందరూ ట్రావెల్ అవుతారు. ఇలాంటి సినిమాలు థియేటర్స్ లో చూస్తే ఎంజాయ్ చేస్తారు… కానీ ఓటీటీలో పెట్టుకుని ఒక్కరే చూస్తే ‘ఏముంది ఇందులో’ అనే కామెంట్సే వినిపిస్తాయి.