Dhanush: ధనుష్ కష్టమంతా వృధాయేనా?

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరో రేంజ్ కి ఎదిగారు ధనుష్. ప్రస్తుతం కోలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోల్లో ఆయన కూడా ఒకరు. అయితే కేవలం తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అతడికి గుర్తింపు ఉంది. అనువాద చిత్రాలతోనే తెలుగులో పాపులర్ అయిన ఈ నటుడు ‘రాన్‌జానా’, ‘షమితాబ్’, ‘ఆత్రంగిరే’ వంటి సినిమాలతోనే హిందీలో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంటర్నేషనల్ లెవెల్ లో తనదైన ముద్ర వేయాలని చూస్తున్నారు.

ఇప్పటికే హాలీవుడ్ లో ‘ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ద ఫాకిర్’ అనే సినిమాలో నటించారు. కానీ ఆ సినిమా రిలీజ్ కి చాలా ఆలస్యమైంది. చివరికి రిలీజ్ తరువాత కూడా సరైన స్పందన రాలేదు. అయినా ధనుష్ నిరాశ చెందలేదు. అతడికి ఇంకో భారీ ఇంటర్నేషనల్ సినిమాలో అవకాశం దక్కింది. అదే ‘ది గ్రే మ్యాన్’. ‘ఎవెంజర్స్’తో పాటు ‘కెప్టెన్ అమెరికా: వింటర్ సోల్జర్’ లాంటి భారీ హాలీవుడ్ సినిమాలకు దర్శకత్వం వహించిన రుసో బ్రదర్స్ నెట్ ఫ్లిక్స్ కోసం రూపొందించిన సినిమా ఇది.

ర్యాన్ గ్లాసింగ్, క్రిస్ ఎవన్స్ లాంటి టాప్ హాలీవుడ్ స్టార్స్ ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. ఇందులో ధనుష్ కూడా ఓ ముఖ్యపాత్రలో నటించారు. అంతర్జాతీయ స్థాయిలో ధనుష్ కెరీర్ కి ఈ సినిమా ఒక్క టర్నింగ్ పాయింట్ అవుతుందని అందరూ ఆశించారు. నెట్ ఫ్లిక్స్ సంస్థ ఏకంగా రూ.200 కోట్లు పెట్టి నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకులకు నిరాశ కలిగించేలా ఉందని టాక్. ఈ నెల 22న నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమాను స్ట్రీమ్ చేయనుండగా..

అమెరికాలో ప్రముఖులకు, మీడియాకు స్పెషల్ ప్రీమియర్స్ వేశారు. ఈ కార్యక్రమానికి ధనుష్ తన ఇద్దరు కొడుకులతో వెళ్లారు. కానీ ఈ ప్రీమియర్స్ తరువాత వచ్చిన రివ్యూలన్నీ నెగెటివ్ గా ఉన్నాయి. హైప్ ఇచ్చినంత మేటర్ సినిమాలో లేదని తేల్చి చెబుతున్నారు. రివ్యూలలో అసలు ధనుష్ గురించి ప్రస్తావన కూడా లేదు. సినిమాలో కూడా అతడి పాత్రకు ప్రాధాన్యం అంతంతమాత్రమే కావడంతో ధనుష్ కి తీవ్ర నిరాశ తప్పేలా లేదు!

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus