వినాయక చవితి పండుగ కానుకగా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లలో ఒకటైన జీ5 యాప్ లో రాహుల్ రామకృష్ణ, అవికాగోర్ ప్రధాన పాత్రల్లో నటించిన “నెట్” మూవీ విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. రాహుల్ రామకృష్ణ, అవికా గోర్ నటన నెట్ మూవీకి హైలెట్ గా నిలిచాయి. తనదైన శైలి యాక్టింగ్ తో రాహుల్ రామకృష్ణ మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారు.
దర్శకుడు భార్గవ్ మాచర్ల రెండు యువజంటల మధ్య జరిగే కథను చూపిస్తూ మనకు తెలియని మూడో కన్ను మనల్ని ఎప్పుడూ చూస్తూనే ఉంటుందని ఈ సినిమా ద్వారా సందేశం ఇచ్చారు. సినిమాలో రాహుల్ రామకృష్ణ లక్ష్మణ్ పాత్రలో అవికా గోర్ ప్రియ పాత్రలో నటించారు. చాలా సంవత్సరాల తర్వాత తెలుగులో నటించిన అవికా గోర్ కు నెట్ మూవీ సక్సెస్ తో మరిన్ని మూవీ ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
గంటన్నర నిడివి ఉన్న ఈ సినిమాలో ప్రేక్షకులను ఆలోచింపజేసే ఎన్నో సన్నివేశాలు ఉన్నాయి. నరేష్ కుమరన్ సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయ్యాయి. తమడా మీడియా ప్రొడక్షన్ విలువలు బాగున్నాయి. అభిరాజ్ సినిమాటోగ్రఫీ బాగుంది. దర్శకుడు భార్గవ్ కథను తెరపై అద్భుతంగా చూపించి చెప్పాలనుకున్న అంశాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పారు. రాహుల్, అవికా గోర్ కెరీర్ కు నెట్ మూవీ ప్లస్ అవుతుందనడంలో సందేహం అవసరం లేదు.