Nayanthara, Vignesh: నయన్- విగ్నేష్ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చిన నెట్ ఫ్లిక్స్..!

లేడీ సూపర్ స్టార్ నయనతార, కోలీవుడ్ దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ ల పెళ్లి జూన్ 9న అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. 7 ఏళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఎట్టకేలకు ఈ ఏడాది పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లికి అతి తక్కువ మంది సెలబ్రిటీలను మాత్రమే ఆహ్వానించారు. ఈ క్రమంలో వీరి పెళ్లి వేడుకను స్ట్రీమింగ్ చేసుకునేందుకు నెట్‌ఫ్లిక్స్‌ భారీ రేటు చెల్లించి మరీ హక్కులు దక్కించుకుంది. త్వరలోనే నయన్- విగ్నేష్ ల పెళ్లి.. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

తాజాగా టీజర్‌ను కూడా నెట్‌ఫ్లిక్స్‌ వారు రిలీజ్‌ చేయడం జరిగింది.ఈ టీజర్లో ఓ పక్క వీరి పెళ్ళికి సంబంధించిన విజువల్స్ చూపిస్తూనే మరోపక్క నయన్‌-విఘ్నేశ్‌లు తమ ప్రేమ గురించి మధుర క్షణాలను షేర్ చేసుకుంటున్నట్టు కూడా ఉంది. విగ్నేష్ గురించి నయన్…, నయన్ గురించి విగ్నేష్ లు.. ఒకరిపై మరొకరికి ఎంత ఇష్టం ఉన్నది చాలా అందంగా వర్ణిస్తున్నట్టు ఈ టీజర్ తెలిపింది. మధ్య మధ్యలో వీరి పెళ్లి ప్రేమ, పెళ్లికి సంబంధించిన ఆసక్తికర ఫోటోలు, వీడియోలు హైలెట్ గా నిలిచాయి.

నయన్ – విగ్నేష్ ల పెళ్లి మహాబలిపురంలోని ఓ రిసార్ట్ లో జరిగిన సంగతి తెలిసిందే. మొదట తిరుపతి వేదికగా వీరి పెళ్లి జరుగుతుంది అని చెప్పుకొచ్చారు కానీ తర్వాత మార్చడం జరిగింది. ఇక వీరి పెళ్ళికి షారుక్‌ ఖాన్‌, ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎఆర్‌ రెహమాన్‌, రజినీకాంత్, దర్శకుడు అట్లీ, మణిరత్నం.. వంటి వారితో పాటు మరికొంతమంది సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇక నయన్‌ దంపతుల పెళ్లి డాక్యుమెంటరీని ప్రేమ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్ట్ చేయగా, విగ్నేష్- నయన్ ల సొంత బ్యానర్ అయిన ‘రౌడీ పిక్చర్స్’ పై నిర్మించుకోవడం విశేషం.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus