‘అల వైకుంఠపురములో’ ‘పుష్ప( ది రైజ్) వంటి చిత్రాల విజయాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు బన్నీ. ఈ రెండు చిత్రాలతో నార్త్ లో తిరుగులేని ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ‘పుష్ప’ మొదటి భాగం బాలీవుడ్లో రూ.108 కోట్ల పైగా నెట్ కలెక్షన్లను రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో ‘పుష్ప 2’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు.ఈ మధ్యనే పూజా కార్యక్రమాలతో ప్రారంభోత్సవం జరిగింది.
కానీ ఇంకా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాలేదు. దర్శకుడు సుకుమార్ అండ్ టీం ‘పుష్ప 2’ పై ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. సోషల్ మీడియాలో ఏవేవో గాసిప్స్ వినిపిస్తున్నాయి. ‘పుష్ప 2’ లో అల్లు అర్జున్.. సింహంతో పోరాడే సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు కథనాలు పుట్టుకొస్తుండడంతో ‘పుష్ప 2’ పై అభిమానుల్లో ఆసక్తి ఇంకా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ‘ఊర్వశివో రాక్షసివో’ సక్సెస్ మీట్ కు నిన్న బన్నీ అతిథిగా విచ్చేశాడు.
ఈ క్రమంలో బన్నీని అందరూ ‘పుష్ప 2’ అప్డేట్ కోసం అడగడం మొదలుపెట్టారు. దీంతో ‘పుష్ప 2’ గురించి మంచి అప్డేట్ ఇస్తాను అంటూ అల్లు అర్జున్ అభిమానులను ఊరించాడు. ‘పుష్ప’ తగ్గేదే లే అయితే .. రెండో పార్టు అస్సలు తగ్గేదేలే అంటూ చెప్పి టాపిక్ డైవర్ట్ చేశాడు. దీంతో నెటిజన్ల మైండ్ బ్లాక్ అయినట్టు అయ్యింది.
అందుకే ‘ఇదేం అప్డేట్ బన్నీ’ ‘ఇది అప్డేటా?’ అంటూ షాక్ అవుతూ కామెంట్లు పెడుతున్నారు. అలాగే అల్లు అర్జున్ వింతగా నవ్వే నవ్వుకి సంబంధించిన వీడియోలతో కూడా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో ఈ టాపిక్ వైరల్ గా మారింది.