Sushmita: ఆమె వ‌ల్లే స‌గం మైన‌స్..సుస్మిత‌ పై పైర్ అవుతున్న నైటిజన్లు

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెలకు చిరంజీవి కుమార్తెగానే కాకుండా ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. చిరంజీవి సినిమాలకు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేస్తూ వస్తోంది. చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమా ఆ తర్వాత సైరా సినిమా దగ్గర నుంచి కూడా తండ్రికి సుస్మితనే కాస్టింగ్ వర్క్ చేస్తోంది. అలాగే మరోవైపు సొంతంగా గోల్డ్ బాగ్స్ ఎంటర్టైన్మెంట్ పేరిట ఒక నిర్మాణ సంస్థ కూడా ప్రారంభించింది. ఈ బ్యాన‌ర్లోనే సేనాపతి – శ్రీదేవి శోభన్ బాబు వంటి సినిమాలు నిర్మించింది.

ఈ రెండు సినిమాలు కూడా అట్టర్ ప్లాప్ అయ్యాయి. ఇక ఇప్పుడు తన (Sushmita) తండ్రి చిరంజీవి హీరోగా కురసాల కళ్యాణ కృష్ణ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చిరంజీవి నటించిన భోళా శంకర్‌ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయ్యింది. సోషల్ మీడియాలో ఈ సినిమాపై భారీగా ట్రోల్స్ మొదలయ్యాయి. దర్శకుడు మెహర్ రమేష్ పై కూడా చిరంజీవి అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి కుమార్తె సుస్మితను కూడా కొందరు నెటిజన్లు.. చిరు అభిమానులు టార్గెట్ చేస్తున్నారు.

సైరా సినిమాకు ముందు వరకు చిరంజీవి దుస్తులు చాలా బాగుండేవి అని.. ఆ సినిమా నుంచి కాస్ట్యూమ్స్ అంతగా మెప్పించేలా లేవని సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అయితే రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ కు మాత్రం సుస్మిత అదిరిపోయే కాస్ట్యూమ్స్ అందించారని అంటున్నారు. ముఖ్యంగా ఆచార్య – గాడ్ ఫాదర్ – వాల్తేరు వీరయ్య తాజాగా భోళాశంకర్ సినిమాలకు ఆమె ఎంపీక‌ చేసుకుంటున్నా డ్రెస్సులు ఏమాత్రం బాగోలేవ‌ని చెప్తున్నారు.

అసలు పాటల్లో కూడా చిరంజీవి డ్రస్సులు ఏమాత్రం బాగోలేవని విరుచుకుపడుతున్నారు. 70 ఏళ్ల వయసులో కూడా జైలర్ సినిమాలో రజనీకాంత్ కాస్ట్యూమ్స్ చాలా స్టైలిష్ గా ఉన్నాయని వారు గుర్తు చేస్తున్నారు. సైరా – వాల్తేరు వీర‌య్య సినిమాలలో స్టోరీ కొంతమేర బాగుండడంతో సుస్మిత కాస్టింగ్ పై పెద్దగా విమర్శలు రాలేదు. ఆచార్య – గాడ్ ఫాదర్ – భోళా శంకర్ సినిమాలు డిజాస్టర్ కావడంతో ఇప్పుడు చిరంజీవి లుక్ పై కూడా కామెంట్లు పడుతున్నాయి.

భోళా శంకర్ సినిమాలో చిరంజీవి ఉపయోగించిన దుస్తులు ఎప్పుడో 20 – 30 సంవత్సరాల నాటి పాత మోడల్గా ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు. దీంతో చిరంజీవి రాబోయే సినిమాల నుంచి అయినా కాస్ట్యూమ్ డిజైనర్ గా సుస్మితను తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. చిరంజీవి వచ్చే సినిమా సుస్మిత తన హోమ్ బ్యానర్ లోనే నిర్మిస్తుంది కాబట్టి.. ఆమె ఎలాంటి ? నిర్ణయం తీసుకుంటుందో అన్న టెన్షన్ కూడా అందరిలోనూ ఉంది.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus