Kayadu Lohar: కయాడు విషయంలో మళ్ళీ మాట మార్చారుగా..!
- March 26, 2025 / 01:56 PM ISTByPhani Kumar
నెటిజన్ల మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. ఏ విషయాన్ని ఎప్పుడు ట్రెండ్ చేస్తారో.. తర్వాత ఎందుకు తిట్టి పోస్తారో అర్థం కాదు. ఉదాహరణకి ఒక సినిమా వచ్చింది అంటే.. అది ఓ మాదిరిగా ఉన్నా దాన్ని తెగ లేపుతారు. తర్వాత అది ఓటీటీకి వస్తే తిట్టిపోస్తారు. ఓవర్ హైప్ అని.. రకరకాల కామెంట్లతో విమర్శిస్తారు. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అలాంటిదే రిపీట్ అవుతుంది. కాకపోతే.. సినిమా విషయంలో కాదు, ఓ హీరోయిన్ విషయంలో..!
Kayadu Lohar

విషయంలోకి వెళితే.. ఇటీవల ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ (Return of the Dragon) అనే సినిమా రిలీజ్ అయ్యింది. ‘లవ్ టుడే’ (Love Today) ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) హీరోగా నటించిన సినిమా ఇది. ఇందులో అనుపమతో (Anupama Parameswaran) పాటు కయాడు లోహార్ (Kayadu Lohar )… అనే హీరోయిన్ కూడా నటించింది. ‘ప్రేమలు (Premalu) బ్యూటీ మమిత బైజు(Mamitha Baiju)… కంటే కూడా కయాడు లోహార్ చాలా క్యూట్ గా ఉందని..ఇలా ఓ రేంజ్లో ఆమెను తెగ పొగిడేశారు. అయితే రెండు రోజుల క్రితం ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సినిమా ఓటీటీలోకి వచ్చింది.

థియేటర్లలో మిస్ అయిన ఆడియన్స్ ఇక్కడ ఎగబడి చూశారు. సినిమా విషయంలో ఓకే కానీ.. కయాడు పోషించిన పల్లవి అనే పాత్రని ఎందుకు అంత లేపారు? ఆమె లుక్స్ కూడా గొప్పగా ఏమున్నాయి? అంటూ నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. వాస్తవానికి.. 2022 లో శ్రీవిష్ణు (Sree Vishnu) హీరోగా ‘అల్లూరి’ (Alluri) అనే సినిమా వచ్చింది.

ఇందులో కయాడు లోహర్ మెయిన్ హీరోయిన్. ఆ టైంలో కనీసం కయాడు పేరుతో హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అయ్యింది లేదు. ఇప్పుడు మాత్రం ఆమె రకరకాలుగా ట్రెండ్ అవుతుంది. ఏదైతేనేం.. ఈమె రవితేజ (Ravi Teja) సినిమాలో ఛాన్స్ కొట్టింది. అక్కడి నుండి ఈమె తెలుగులో కూడా బిజీ అవుతుందేమో చూడాలి.












