Balakrishna: బాలయ్య సక్సెస్ మీట్ వెనుక అసలు కథ ఇదే!

స్టార్ హీరో బాలకృష్ణ నటించిన అఖండ మూవీ గతేడాది డిసెంబర్ నెల 2వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. 70 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలోనే 70 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం షేర్ కలెక్షన్లను సాధించింది. సంక్రాంతికి బంగార్రాజు మినహా పెద్ద సినిమాలు రిలీజ్ కాకపోవడంతో అఖండ ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకొదగ్గ స్థాయిలో థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. అయితే తాజాగా అఖండ చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.

ఈ సక్సెస్ మీట్ లో అఖండ 50 రోజుల ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ నెల 21వ తేదీ నుంచి అఖండ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. రిలీజైన ఏడు వారాల తర్వాతే సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే విధంగా మేకర్స్ ఒప్పందం కుదుర్చుకున్నారు. పుష్ప మూవీ ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండటంతో ఈ సినిమాను థియేటర్లలో ఎవరూ చూడటం లేదు. అయితే అఖండ ఓటీటీలో అందుబాటులో లేకపోవడంతో సంక్రాంతి పండుగకు ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలని అనుకునే వాళ్లకు అఖండ మంచి ఆప్షన్ గా నిలవనుంది.

బాలయ్య సక్సెస్ మీట్ లో అఖండపై హైప్ పెంచేలా చేసిన కామెంట్ల వల్ల ఇప్పటివరకు ఈ సినిమాను చూడని ప్రేక్షకులు థియేటర్లలో ఈ సినిమాను చూడటానికి ఇష్టపడుతున్నారు. మాస్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లా ఉన్న అఖండ సంక్రాంతి సెలవులు పూర్తయ్యే వరకు మంచి కలెక్షన్లు సాధించే అవకాశాలు ఉన్నాయి. ప్రెస్ మీట్ లో అఖండ గురించి పాకిస్తాన్ లో కూడా చర్చ జరుగుతోందని బాలయ్య చేసిన సెన్సేషనల్ కామెంట్లు ఈ సినిమాకు కలిసొస్తున్నాయి.

ఫుల్ రన్ లో అఖండ 75 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంటుందేమో చూడాలి. ఓటీటీలో అఖండ ఆలస్యంగా స్ట్రీమింగ్ అయ్యేలా బాలయ్య తీసుకున్న నిర్ణయం అదుర్స్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం. బోయపాటి శ్రీను ఈ సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కిస్తానని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Share.