Balakrishna, Chiranjeevi: మళ్ళీ చిరుతో బాలయ్య ఫైట్ కి దిగాల్సిందేనా..!
- June 21, 2025 / 03:45 PM ISTByPhani Kumar
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్లో 4వ సినిమాగా రూపొందుతుంది ‘అఖండ 2’ (Akhanda 2). ఈ చిత్రాన్ని ’14 రీల్స్ ప్లస్’ సంస్థపై రామ్ ఆచంట (Ram Achanta), గోపీచంద్ ఆచంట (Gopichand Achanta) నిర్మిస్తున్నారు. ఇటీవల అంటే బాలకృష్ణ (Nandamuri Balakrishna)పుట్టినరోజు సందర్భంగా టీజర్ రిలీజ్ అయ్యింది. దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో చాలా రోజులు ట్రెండింగ్ లో నిలిచింది.
Balakrishna, Chiranjeevi
ఈ టీజర్లో బాలయ్య (Nandamuri Balakrishna) హిమాలయాల్లో.. మెడ చుట్టూ త్రిశూలం తిప్పుతూ చేసే శత్రుసంహారం సీన్ ఏదైతే ఉందో.. అది అందరినీ విశేషంగా ఆకట్టుకుంది అని చెప్పాలి. ఇక ఇదే టీజర్ తో సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతుంది అని కూడా మేకర్స్ రివీల్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ‘అఖండ 2’ (Akhanda 2) ఆ డేట్ కి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

- 1 Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!
- 2 8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!
- 3 ‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు
- 4 33 ఏళ్ళ ‘పెద్దరికం’ గురించి 15 ఆసక్తికర విషయాలు…!
- 5 Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!
ఎందుకంటే.. సినిమా షూటింగ్ చాలా పెండింగ్ ఉంది. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఎక్కువగానే చిత్రీకరించాల్సి ఉంది. తర్వాత వి.ఎఫ్.ఎక్స్ వర్క్ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఎంత కాదనుకున్నా.. వీటికి మరో 5 నెలలు టైం పడుతుంది. కాబట్టి సెప్టెంబర్ 25కి వచ్చే అవకాశాలు లేవు. నాన్ థియేట్రికల్ బిజినెస్ కోసమే ఆ డేట్ కి వస్తున్నట్టు టీం టీజర్ తో చెప్పడం జరిగింది అనే టాక్ వినిపిస్తోంది.

సెప్టెంబర్ మిస్ అయితే కనుక మేకర్స్ సంక్రాంతికే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారట. ఆల్రెడీ సంక్రాంతికి చిరు (Chiranjeevi)- అనిల్ (Anil Ravipudi) సినిమా ఫిక్స్ అయ్యింది. రవితేజ (Ravi Teja), నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) సినిమాలు కూడా ఉంటాయని ప్రకటించారు. 4వ సినిమా అంటూ వస్తే.. అది చిన్న సినిమా అయితే పర్వాలేదు కానీ ‘అఖండ 2’ వంటి పెద్ద సినిమా అంటే అందరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏ శివరాత్రి పండుగకో ప్లాన్ చేసుకుంటే ఇబ్బంది ఉండదు. చూద్దాం నిర్మాతలు ఫైనల్ గా ఏది డిసైడ్ అవుతారో..!
















