ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్1 మూవీ నుంచి ట్రైలర్ తాజాగా విడుదలై రికార్డ్ స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకుంటోంది. సలార్ ట్రైలర్ లో ప్రభాస్ లుక్స్ మాత్రం వేరే లెవెల్ లో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ప్రభాస్ బెస్ట్ లుక్ ఇదేనంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. 3 నిమిషాల 46 సెకన్ల ట్రైలర్ లో ప్రతి షాట్ వేరే లెవెల్ లో ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సలార్ ట్రైలర్ చూసిన ప్రేక్షకులలో ఎక్కువమంది ట్రైలర్ లో గూస్ బంప్స్ షాట్స్ ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఫ్రెండ్ షిప్ కు సంబంధించిన షాట్స్, యాక్షన్ సీన్స్ వేరే లెవెల్ లో ఉన్నాయని ఫ్యాన్స్ నుంచి కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ కు ట్రైలర్ ఎంతగానో నచ్చేసింది. ప్రభాస్ చరిత్ర సృష్టించడానికి చరిత్ర తిరగరాయడానికి పుట్టాడని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.
ప్రభాస్ కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా అని ప్రశాంత్ నీల్ రేంజ్ ను ఈ సినిమా పెంచడం ఖాయమని కొంతమంది చెబుతున్నారు. ప్రభాస్, పృథ్వీరాజ్ కాంబో డెడ్లీ కాంబో అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ ఆన్ ఫైర్ అంటూ ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా పర్ఫెక్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ అని ఫ్యాన్స్ చెబుతున్నారు. అయితే సలార్ ట్రైలర్ పై కొన్ని నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి.
(Salaar) సలార్, కేజీఎఫ్ మధ్య ఉన్న పోలికల గురించి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అయితే ప్రశాంత్ నీల్ కావాలనే అంచనాలను తగ్గించే ప్రయత్నం చేశారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు భారీ రేంజ్ లో సక్సెస్ సాధించి మంచి లాభాలను అందిస్తాయేమో చూడాల్సి ఉంది. సలార్1 మూవీ సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.