రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు వరదల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి (Chiranjeevi) , బాలకృష్ణ (Balakrishna ), మహేష్ బాబు (Mahesh Babu) , పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), జూనియర్ ఎన్టీఆర్(Jr NTR), విశ్వక్ సేన్(Vishwak Sen), సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), మరి కొందరు ప్రముఖ నటులు, నిర్మాతలు, దర్శకులు తమ వంతు సహాయం చేశారు. అయితే హీరోయిన్ల వైపు నుంచి విరాళాల విషయంలో నామ మాత్రపు స్పందన కూడా లేకపోవడం గమనార్హం. స్రవంతి చొక్కారపు (Sravanthi Chokkarapu) లాంటి యాంకర్లు తమ వంతు విరాళం ప్రకటించగా కోట్లకు కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే హీరోయిన్లు (Star Heroines) మాత్రం విరాళాలను ప్రకటించడానికి ఆసక్తి చూపడం లేదు.
Star Heroines
టాలీవుడ్ హీరోయిన్ల తీరు మారాల్సిన అవసరం అయితే ఉంది. గతంలో కూడా ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో హీరోయిన్లు స్పందించిన సందర్భాలు తక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రజలు కష్టకాలంలో ఉన్న సమయంలో సైతం స్పందించకపోతే ఎలా అని హీరోయిన్లపై కొంతమంది నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. నెగిటివ్ కామెంట్ల విషయంలో హీరోయిన్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.
తమ రెమ్యునరేషన్ లో సెలబ్రిటీలు కొంత మొత్తం సహాయం చేసినా ఎంతోమంది కష్టాలు తీరే అవకాశం ఉంటుంది. అనన్య నగళ్ల లాంటి కొంతమంది హీరోయిన్లు మాత్రమే సాయం ప్రకటించారు. మెజారిటీ స్టార్ హీరోయిన్లు మాత్రం విరాళం ఇవ్వాల్సిన అవసరం ఏముందనే విధంగా వ్యవహరిస్తున్నారు. హీరోయిన్లలో (Star Heroines) సాయం చేసిన హీరోయిన్ల సంఖ్యను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు.
ధన రూపంలో కాకపోయినా ఫుడ్ లేదా నిత్యావసర వస్తువులు అందించడం ద్వారా సహాయం చేస్తే ప్రజలకు మేలు కలుగుతుంది. సీనియర్ హీరోయిన్లు సైతం తెలుగు రాష్ట్రాల ప్రజలకు అండగా నిలబడితే బాగుంటుందని చెప్పవచ్చు. హీరోయిన్లు ఎందుకు సహాయం చేయడానికి ముందుకు రావడం లేదో అర్థం కావడం లేదని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.