యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (N. T. Ramarao (Jr NTR)) పుట్టినరోజు కానుకగా దేవర (Devara) సినిమా నుంచి ఫియర్ సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే. దేవర ముంగిట నువ్వెంత అంటూ లిరిక్స్ తో సాగే ఈ సాంగ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సాంగ్ తెలుగు వెర్షన్ కు ఇప్పటివరకు దాదాపుగా 5 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అయితే జైలర్ (Jailer) హుకుం, దేవర ఫియర్ సాంగ్స్ లో ఏ సాంగ్ బెస్ట్ అనే చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతోంది.
అయితే ఎక్కువమంది మాత్రం దేవర సాంగ్ కే ఓటేస్తున్నారు. జైలర్ హుకుం సాంగ్ కూడా అద్భుతమైన సాంగ్ అని అయితే ఈ సాంగ్ అంచనాలను మించి ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry) ఈ సినిమాకు సంగీతం అందించగా సాహిత్యం అద్భుతంగా ఉందని దేవర పాత్రను ఎలివేట్ చేసే విధంగా ఈ సాంగ్ ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
కొన్ని చోట్ల మ్యూజిక్ లిరిక్స్ ను డామినేట్ చేసిందని కామెంట్లు వ్యక్తమవుతున్నా సినిమాలో ఆ పొరపాట్లు లేకుండా చూసుకుంటారని తెలుస్తోంది. దేవర సాంగ్ నంబర్ 1గా ట్రెండ్ అవుతుండటం గమనార్హం. ఈ సాంగ్ పిక్చరైజేషన్ సైతం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని తెలుస్తోంది. దేవర గెటప్ లో తారక్ అదుర్స్ అనేలా ఉన్నారని సినిమాలో వయొలెన్స్ ఎక్కువగా ఉండనుందని తెలుస్తోంది.
దసరా పండుగ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుండటం ఈ సినిమాకు అడ్వాంటేజ్ కానుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేవర రిలీజ్ తో ఈ దసరా అభిమానులకు మరింత స్పెషల్ కానుందని తెలుస్తోంది. ఏపీలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా దేవర సినిమాకు టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.