Sreeleela: శ్రీలీల కొత్త లుక్ విషయంలో ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే.. మారాలంటూ?

  • June 12, 2024 / 07:54 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన శ్రీలీలకు గతంతో పోల్చి చూస్తే ఆఫర్లు తగ్గినా ప్రేక్షకుల్లో క్రేజ్ మాత్రం తగ్గలేదు. శ్రీలీల (Sreeleela)  ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తే మళ్లీ వరుస ఆఫర్లను సొంతం చేసుకోవడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే రవితేజ (Ravi Teja) శ్రీలీల కాంబినేషన్ లో మరో సినిమాకు సంబంధించి ప్రకటన వెలువడగా వైరల్ అవుతున్న ఫోటోలలో శ్రీలీల బొద్దు లుక్ లో కనిపించడం గమనార్హం. శ్రీలీల బరువు పెరిగారని కొంతమంది కామెంట్లు చేస్తుండగా మరి కొందరు మాత్రం చీరకట్టు వల్ల శ్రీలీల లావుగా కనిపిస్తున్నారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రవితేజ , శ్రీలీల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మరో మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది. మరోవైపు శ్రీలీల బరువు తగ్గాలని నెటిజన్లు సూచిస్తున్నారు. ఈ విషయంలో మారకపోతే శ్రీలీల కెరీర్ కే ప్రమాదమని చెబుతున్నారు. బరువు పెరగడం వల్ల చాలామంది హీరోయిన్లు టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమయ్యారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.

శ్రీలీలకు టాలీవుడ్ ఇండస్ట్రీలో పూర్వ వైభవం రావాలని అభిమానుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీలీల ఈ కామెంట్ల విషయంలో ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. మరి కొందరు మాత్రం సినిమాలో పాత్రకు అనుగుణంగా శ్రీలీల బరువు పెరిగి ఉండొచ్చని కామెంట్లు చేస్తున్నారు. పెరిగిన బరువు విషయంలో శ్రీలీల మనస్సులో ఏముందో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని చెప్పవచ్చు.

భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో శ్రీలీలకు పూర్వ వైభవం రావడంతో పాటు ఇండస్ట్రీ హిట్లు దక్కాలని అభిమానులు ఫీలవుతున్నారు. శ్రీలీల త్వరలో మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను ప్రకటిస్తే బాగుంటుందని చెప్పవచ్చు. బాలీవుడ్ ఇండస్ట్రీపై శ్రీలీల ఫోకస్ పెడుతుందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. శ్రీలీల టాలెంట్ ను ఎంత ప్రశంసించినా తక్కువేనని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus