Rajinikanth, Roja: ప్రముఖ నటి రోజాను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు .. కారణమేంటంటే?

వైసీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటి రోజా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రోజా ఈ మధ్య కాలంలో వైసీపీ గురించి ఎవరు విమర్శలు చేసినా ఘాటుగా బదులిస్తూ ఫ్యాన్స్ కు దగ్గరవుతున్నారు. కొంతకాలం క్రితం రోజా రజనీకాంత్ పై విమర్శలు చేయగా ఆ విమర్శలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా రజనీ కొన్ని కామెంట్లు చేయడంతో రోజా రజనీకాంత్ పై విమర్శలు చేయడం జరిగింది.

“రజనీకాంత్ ను మనం పెద్ద స్థాయిలో ఊహించుకున్నాం.. కానీ ఆయన జీరో అయిపోయారు” అని రోజా ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. ఆ సమయంలో కోలీవుడ్ సినీ అభిమానులు రోజాపై ఫైర్ అయిన సంగతి తెలిసిందే. అయితే రోజా తాజాగా జైలర్ సినిమా డైలాగ్ చెబుతూ ఇతర పార్టీల నేతలపై సెటైర్లు వేశారు. రోజా మాట్లాడుతూ ” మొరగని కుక్క లేదు.. విమర్శించని నోరు లేదు.. ఇవి రెండూ లేని ఊరు లేదు.. అర్థమైందా రాజా” అంటూ తమిళంలో డైలాగ్ చెప్పారు.

రజనీకాంత్ (Rajinikanth) పై విమర్శలు చేసి ఇప్పుడు రజనీకాంత్ డైలాగ్ ను రోజా చెప్పడంపై కోలీవుడ్ సినీ అభిమానులు ట్రోల్స్ చేస్తున్నారు. రోజా గురించి రజనీ ఫ్యాన్స్ చేస్తున్న ట్రోల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. రజనీకాంత్ ఫ్యాన్స్ ట్రోల్స్ గురించి నెటిజన్ల రియాక్షన్ పై రోజా ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. 2014, 2019 ఎన్నికల్లో రోజా ఎమ్మెల్యేగా సాధించడం గమనార్హం.

రోజా ప్రస్తుతం మంత్రిగా ఉండటంతో సినిమాలకు, టీవీ షోలకు దూరంగా ఉన్నారు. 2024 ఎన్నికల ఫలితాలను బట్టి రోజా సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తారో లేదో క్లారిటీ రావాల్సి ఉంది. రోజా అనవసర వివాదాలకు దూరంగా ఉండాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో రోజాకు అనుకూల ఫలితాలు వస్తాయో లేదో తెలియాల్సి ఉంది. రోజా కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus