వరుణ్ హీరోయిన్ పై నెటిజన్స్ ట్రోలింగ్.. కానీ?

లోఫర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో దిశా పటాని తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. హిందీలో దిశా పటాని తక్కువ సినిమాలే చేసినా ఆ సినిమాలు నటిగా దిశా పటానికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఎమ్మెస్ ధోని, బాఘి2 సినిమాలకు దిశా పటాని అవార్డులను అందుకున్నారు. ఒకవైపు సినిమాలలో గ్లామరస్ రోల్స్ చేస్తూనే మరోవైపు దిశా పటాని అభినయ ప్రధాన పాత్రలు కూడా చేస్తున్నారు. ఈ హీరోయిన్ కు సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

అయితే డ్రెస్సింగ్ విషయంలో దిశా పటానిని నెటిజన్లు తీవ్రస్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. బ్రౌన్ టాప్, బ్లూ రిప్‌డ్ జీన్స్ లో దిశా పటాని ఉన్న ఫోటోను ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్లలో ఒకరైన మానవ్ మంగ్లా సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఆ ఫోటోలో దిశా పటాని డ్రెస్సింగ్ గురించి నెటిజన్లు పోకిరిలాగా ఉన్నావ్ అంటూ ఆమె గురించి కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరు అడుక్కునే వాళ్లు కూడా ఈ విధంగా బట్టలు వేసుకోరు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరొక నెటిజన్ “ఇలా చిరిగిన బట్టలను వేసుకుంటున్నారు.. నా దేశానికి ఏమైంది.. ఎంత పేదవాళ్లు” అంటూ కామెంట్ పెట్టారు. నెటిజన్ల ట్రోల్స్ గురించి దిశా పటాని ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. దిశా పటాని స్కిన్ షో గురించి కొందరు నెటిజన్లు నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. దిశా పటాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగులో కూడా ఈ బ్యూటీకి సినిమా ఆఫర్లు వస్తున్నాయని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

చరణ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ మూవీకి దిశా పటాని ఫైనల్ అయిందని ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్ మూవీతో దిశా పటాని టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా బిజీ అవుతారేమో తెలియల్సి ఉంది. లోఫర్ మూవీ తెలుగులో ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. రామ్ చరణ్ సినిమాలో దిశా పటాని నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Share.