బాలీవుడ్ లో సరికొత్త లవ్ పెయిర్!
- April 19, 2016 / 09:48 AM ISTByFilmy Focus
కత్రినాతో బ్రేకప్ అనంతరం రణబీర్ కపూర్.. హృతిక్ తో బ్రేకప్ కాని బ్రేకప్ అనంతరం కంగనాలు “ప్రేమ లేదు, దోమ లేదు” అంటూ కేవలం సినిమాలపైనే దృష్టి సారిస్తూ వస్తున్నారు. అయితే.. ఇటీవల వీరిద్దరూ దగ్గరవుతున్నారని బాలీవుడ్ వర్గాల సమాచారం.
సంజయ్ దత్ జీవితం ఆధారంగా బాలీవుడ్ లో తెరకెక్కనున్న చిత్రంలో కథానాయికగా కంగనాను రణబీర్ కపూర్ సిఫారసు చేసాడని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. రెండు మూడు బ్రేకప్పుల తర్వాత కలుస్తున్న ఈ ఇద్దరు రిలేషన్ ఎన్నాళ్లు నిలుస్తుందో తెలియదు కానీ.. బాలీవుడ్ లో వివాదాస్పద వ్యక్తులుగా పేర్కొనే ఈ ఇద్దరు అసలు కలిసి జీవించగలరా? అని ముంబై జనాలు చెవులు కొరుక్కొంటున్నారు!
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus















