క్రిష్‌కి రకుల్ టెన్షన్ మొదలయ్యింది

మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ రెండో సినిమాకీ టెన్షన్ తప్పేట్టు కనబడటం లేదు. అతడు హీరోగా యాక్ట్ చేసిన మొదటి సినిమా ‘ఉప్పెన’ ఇంకా రిలీజ్ కాలేదు. ఆల్రెడీ రిలీజ్ కావాల్సిన ఈ సినిమాకి కరోనా రూపంలో అడ్డంకి ఎదురైంది. థియేటర్లు క్లోజ్ కావడంతో ఎప్పుడు ఓపెన్ అయితే అప్పుడు రిలీజ్ చెయ్యాలని వెయిట్ చేస్తున్నారు. ‘ఉప్పెన’ రిలీజ్‌కి ముందే రెండో సినిమా స్టార్ట్ చేశాడు వైష్ణవ్ తేజ్. క్రిష్ డైరెక్షన్ లో ఒక సినిమా యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని బాలీవుడ్ డ్రగ్ కేసు టెన్షన్ పెడుతోంది.

క్రిష్ సినిమాలో రకుల్ హీరోయిన్. డ్రగ్స్ కేసులో విచారణకు అటెండ్ కావాలని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆమెకు సమన్లు జారీ చేసింది. ముంబయ్ వెళ్ళిన రకుల్ మొన్న శుక్రవారం విచారణకు హాజరయ్యింది. దాంతో క్రిష్ సినిమా షూటింగ్ కి టెన్షన్ మొదలయ్యింది. సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ ఫినిష్ చెయ్యాలని క్రిష్ ప్లాన్ చేశారు. కానీ, డ్రగ్స్ కేసులో రకుల్ పేరు వుండటంతో అది కుదిరేలా కనిపించడం లేదు. ఆల్రెడీ ఒకసారి నార్కోటిక్స్ బ్యూరో ముందు రకుల్ అటెండ్ అయ్యింది.

మరోసారి రమ్మని వాళ్ళు పిలిస్తే వెళ్ళక తప్పదు. అప్పుడు షెడ్యూల్ డిస్టర్బ్ అవుతుంది. అందుకని క్రిష్ వర్రీ అవుతున్నారట. కేసు నుండి రకుల్ ఎంత త్వరగా ఫ్రీ అయితే, క్రిష్ అంత త్వరగా టెన్షన్ ఫ్రీ అవుతారు. పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. కరోనా వల్ల ఆ సినిమాకి బ్రేక్ పడటంతో మధ్యలో పవన్ మేనల్లుడితో సినిమా స్టార్ట్ చేశారు. దీన్ని ఫాస్ట్ గా ఫినిష్ చేసి, పవన్ షూటింగ్ కి రెడీ అయ్యేలోపు ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ చెయ్యాలని ప్లాన్ చేశారు. ఏం జరుగుతుందో చూడాలి.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus