క్రిస్మస్ పార్టీలో మెగా హీరోలందర్నీ హగ్ చేసుకున్న చరణ్!
- December 29, 2020 / 11:08 AM ISTByFilmy Focus
చరణ్ తనకు కరోనా పాజిటివ్ అంటూ ట్వీట్ చేయడం పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేయలేదు కానీ.. చరణ్ గతవారంలో క్రిస్మస్ పార్టీకి మెగా హీరోలందర్నీ కలవడం, అందరినీ హగ్ చేసుకొని ముద్దులు పెట్టుకోవడం అనేది చర్చనీయాంశంగా మారింది. మెగా ఫ్యామిలీకి చెందినవారందరు, కొత్త అల్లుడు చైతన్యతో సహా ఈ పార్టీలో ఉన్నారు. మరి వీరిలో చరణ్ ద్వారా ఎవరికైనా వైరస్ సోకిందా అనే ఆలోచన అందరికీ భయం కలిగిస్తోంది. అసలే చరణ్ కు వైరస్ సోకిన లక్షణాలు కనిపించలేదు.
దాంతో అతడి దేహంలో ఎప్పట్నించి సదరు వైరస్ ఉంది అనేది తెలియదు. మొన్నామధ్య ఆచార్య సెట్స్ కు కూడా వెళ్ళాడు చరణ్. కొరటాలను కలిసాడు. ఇంకా పెద్ద విషయం ఏమిటంటే.. ఇటీవలే జరిగిన దిల్ రాజు 50వ పుట్టినరోజు వేడుకలకు చరణ్ హాజరయ్యాడు. అక్కడ మాస్క్ లేకుండానే ప్రభాస్, యష్. మహేష్ బాబు వంటి స్టార్ హీరోలను కూడా కలిసాడు. ఇప్పుడు ఆ ఫోటోలన్నీ చూస్తే ఏ ఒక్కరితోనూ చరణ్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయలేదు.

సో, ఇప్పుడు వాళ్ళందరూ కరోనా కోరల్లో ఉన్నట్లే. లక్కీగా వాళ్ళందరికీ నెగిటివ్ వస్తే సరే.. లేదంటే మాత్రం ఇంతమందికి వైరస్ సోకడానికి కారణంగా చరణ్ నిలిచిపోతాడు. మరి ఈ టెన్షన్ కి తెరపడాలంటే చరణ్ గత రెండు వారాలుగా కలిసినవాళ్ళందరూ టెస్ట్ లు చేయించుకొని రిజల్ట్స్ షేర్ చేయాలి.
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

















