ఇండియాలో అతి పెద్ద కమర్షియల్ వెహికల్స్ కంపెనీ ఏదైనా ఉందా అంటే అది కచ్చితంగా వీఆర్ఎల్ కంపెనీ అనే చెప్పాలి. దీని వ్యవస్థాకుడు.. పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన విజయ్ శంకేశ్వర్ గారి బయోపిక్ గా ‘విజయానంద్’ అనే కన్నడ మూవీ రూపొందుతుంది. డిసెంబర్ 9న కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో ఈ మూవీని విడుదల చేయబోతున్నారు. ‘వి.ఆర్.ఎల్ ఫిల్మ్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై విజయ్ శంకేశ్వర్ గారి అబ్బాయి అయిన డా.ఆనంద్ శంకేశ్వర్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
‘విజయానంద్’ చిత్రంలో విజయ్ శంకేశ్వర్ గా నిహాల్ రాజ్‌పుత్ కనిపించబోతున్నాడు. విజయ్ శంకేశ్వర్ తండ్రి పాత్ర బి.జి.శంకేశ్వర్‌గా కె.జి.ఎఫ్ నటుడు అనంత నాగ్ కనిపించబోతున్నాడు. రిషికా శర్మ దర్శకురాలు. ట్రైలర్ ఈ మధ్యనే రిలీజ్ అయ్యింది. ఈ ఏడాది కన్నడ సినిమాలు చాలా బాగా ఆడుతున్న తరుణంలో.. ‘విజయానంద్’ పై కూడా తెలుగు ప్రేక్షకుల ఫోకస్ పడింది అని చెప్పాలి. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో విజయ్ శంకేశ్వర్ గా నిహాల్ రాజ్‌పుత్ అనే నటుడు కనిపించబోతున్నట్టు ఇందాక మాట్లాడుకున్నాం. కన్నడంలో ఇతను యాంకర్ గా కెరీర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత హీరోగా ఎదిగాడు.
అక్కడ ఇతను ఓ సక్సెస్ ఫుల్ హీరో. కాగా ‘విజయానంద్’ సినిమాలో విజయ్ శంకేశ్వర్ పాత్ర కోసం ఇతను ఏకంగా 22 కేజీలు పెరిగాడట. వినడానికే షాకింగ్ గా ఉంది కదా. విజయ్ శంకేశ్వర్ యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఎక్కువ బరువు ఉండేవారట. అందుకోసం నిహాల్ కూడా అలా మారిపోవాలి అనుకున్నాడు. అందులో భాగంగానే ఏకంగా 22 కేజీల బరువు అతను పెరిగినట్టు తెలుస్తుంది. నిహాల్ మాట్లాడుతూ.. ‘కన్నడలో మొదటి బయోపిక్ సినిమా చేయాలని అనుకున్నాను.
అప్పుడు నా మైండ్‌లోకి విజయ్ శంకేశ్వర్ పేరు వచ్చింది. ఓ 6 నెలలు పగలు రాత్రి అనే తేడా లేకుండా విజయ్ సంకేశ్వర్ గారి గురించి రీసెర్చ్ చేశాం. ఆ తర్వాత విజయ్ శంకేశ్వర్ గారిని అప్రోచ్ అయ్యాం. మీ మీద ఓ సినిమా తీయాలనుకుంటున్నామని చెప్పాను. ‘నేనేమీ సాధించలేదు.. నా మీద ఎందుకు’ అని ఆయన అన్నారు. 15 నిమిషాలు టైం అడిగితే.. 7,8 గంటల పాటు ఆయన మాతో మాట్లాడారు.
ఆయన కుటుంబ సభ్యులంతా కలిసి మాకు ఆయన గురించి 150 గంటల పాటు ఎన్నో విషయాలు చెప్పారు. ఈ సినిమాను 98 రోజులు షూట్ చేశాం. 75 రోజులు అవుట్ డోర్‌లో చేశాం. అందులో ఎక్కువగా రామోజీ ఫిల్మ్ సిటీలోనే చేశాం. ఇందులో నేను 3 వేరియేషన్స్‌లో కనిపిస్తాను. విజయ్ శంకేశ్వర్ గారిలా కనిపించేందుకు బరువు కూడా పెరిగాను. ‘మహానటి’లో కీర్తి సురేష్ గారిని చూశాక.. చేస్తే అలా చేయాలని అనుకున్నాను. విజయ్ శంకేశ్వర్ గారి పాత్రను పోషించడం అంటే అది చాలా పెద్ద బాధ్యత’ అంటూ అతను చెప్పుకొచ్చాడు.
లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..