18 Pages OTT: నిఖిల్ 18 పేజెస్ డిజిటల్ హక్కులను కైవసం చేసుకున్న నెట్ ఫ్లిక్స్!

నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం 18 పేజెస్. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో అల్లు అరవింద్‌ సమర్పణలో సుకుమార్‌ రైటింగ్స్ నుంచి, గీతా ఆర్ట్స్ బ్యానర్ల నుంచి రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ టీజర్ పోస్టర్స్ సినిమా పై భారీ అంచనాలను పెంచేశాయి. ఇక ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ డిసెంబర్ 23వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలోని చిత్ర బృందం పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ సమాచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా డిజిటల్ హక్కుల ద్వారానే భారీగా లాభ పొందినట్లు సమాచారం. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం 18 పేజస్ సినిమా ఓటీటీ, డిజిటల్‌ రైట్స్ భారీ రేటుకు అమ్ముడు పోయాయనీ తెలుస్తుంది.

ఈ సినిమా డిజిటల్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ ఏకంగా 20 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం అదేవిధంగా ఈ సినిమా శాటిలైట్ హక్కులను ప్రముఖ ఎంటర్టైన్మెంట్ సంస్థ కైవసం చేసుకున్నట్లు సమాచారం ఇలా ఓటీటీ శాటిలైట్ ద్వారానే ఈ సినిమా భారీగా లాభాలు పొందినట్టు తెలుస్తుంది. ఇకపోతే నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్లోనే వచ్చినటువంటి కార్తికేయ 2 సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది.

ఈ క్రమంలోని ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్నటువంటి తదుపరిచిత్రం చిత్రం 18 పేజెస్ సినిమాపై కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus