యంగ్ ట్యాలెంటెడ్ దేవన్ హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో ఓ సూపర్ నేచురల్ లవ్ స్టొరీ రూపోందుతోంది. ధన్య బాలకృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. బేబీ వైష్ణవి సమర్పణలో మహాసేన్ విజువల్స్ బ్యానర్ పై జ్యోత్స్న జి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ & మాటలు- అనిల్ కిరణ్ కుమార్ జి అందించారు. ఈ సినిమాకి ‘కృష్ణ లీల’ అనే బ్యాటీఫుల్ టైటిల్ ఖరారు చేశారు. ‘తిరిగొచ్చిన కాలం’అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా టైటిల్, మోషన్ పోస్టర్ లాంచ్ ఈవెంట్ కు ముఖ్య అతిధులుగా హీరో నిఖిల్, బ్రహ్మశ్రీ ఎల్ వీ గంగాధర్ శాస్త్రి, డీవోపీ చోటా కే నాయుడు హాజరయ్యారు.
టైటిల్ లాంచ్ ప్రెస్ మీట్ లో హీరో నిఖిల్ మాట్లాడుతూ.. దేవన్ చాలా పాషన్ వున్న యాక్టర్ డైరెక్టర్. హ్యాపీడేస్ కి ముందు నేను కూడా ఒక మంచి అవకాశం కోసం తపన పడేవాడిని. దేవుడి దయవల్ల నాకు హ్యాపీ డేస్ దొరికింది. అదే దేవుడి దయవల్ల తనకి కృష్ణ లీలతో పెద్ద హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మోషన్ పోస్టరు నాకు చాలా నచ్చింది. ఇందులో దేవ్ డిఫరెంట్ సేడ్స్ నాకు చాలా నచ్చాయి. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. అందరూ ఈ టీం ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’అన్నారు
బ్రహ్మశ్రీ ఎల్వీ గంగాధర్ శాస్త్రి మాట్లాడుతూ.. జై శ్రీకృష్ణ. దేవన్ చాలా పాజిటివ్ పర్సన్. తనని చూడగానే చాలా పాజిటివ్ వైబ్ వచ్చింది. నిరంతనం ప్రయత్నంలో ఉన్న వాడే ఎప్పటికైనా ఘనవిజయం సాధిస్తాడు. దేవన్ కూడా అలాంటి ఘన విజయం ఈ సినిమాతో సాధిస్తాడనే నమ్మకం ఉంది. ఈ సినిమా రచయిత అనిల్ గారు చాలా సంస్కారవంతులు. కృష్ణ లీల చాలా అద్భుతమైన టైటిల్. ఈ సినిమా ఆల్ టైం హిట్స్ గా నిలుస్తుందని నమ్మకం ఉంది. ఈ సినిమా పాటలు విన్నాను. చాలా గొప్ప సాహిత్యం సంగీతం ఇందులో ఉన్నాయి. ఈ సినిమా చాలా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’అన్నారు
డీవోపీ చోటా కే నాయుడు మాట్లాడుతూ… ఈ సినిమా కథ నాకు చాలా నచ్చింది. నిర్మాతలు చాలా పాషన్ తో ఈ కథని చేస్తున్నారు. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. నిఖిల్ ఈవెంట్ కి రావడం చాలా ఆనందంగా ఉంది. తన లాంటి యంగ్ స్టార్ ఇలాంటి అప్ కమింగ్ యంగ్ స్టార్స్ కి సపోర్ట్ చేయడం చాలా మంచి పరిణామం. దేవన్ చాలా టాలెంటెడ్. ఈ సినిమాతో తప్పకుండా అతనికి మంచి పేరు వస్తుంది’అన్నారు
హీరో, డైరెక్టర్ దేవన్ మాట్లాడుతూ. అందరికీ నమస్కారం .ముందుగా నన్ను కన్న మా అమ్మానాన్నలకి కృతజ్ఞతలు. నాకు సినిమా జీవితాన్ని ఇచ్చిన మా నిర్మాతలు జ్యోత్స్న గారికి అనిల్ గారికి ధన్యవాదాలు. వారికి లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. చోటా కె నాయుడు గారు నాకు ఇష్టమైన కెమెరామెన్. ఆయనతో కలవడానికి చాలా ప్రయత్నాలు చేశాను. ఫైనల్ గా ఆయనని కలిసి ఈ సినిమా కథ చెప్పాను. ఆయన కొన్ని మార్పులు చెప్పారు. అవి మాకు చాలా హెల్ప్ అయ్యాయి. చోటా అన్నకి థాంక్యూ. ఆయనే నాకు ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్. ఈ జర్నీ ఒక మిరాకిల్ లా మొదలైంది. గంగాధర్ శాస్త్రి గారికి ఈ సినిమా కథ చెప్పాను. ఆయన నాకు విలువైన సూచనలు ఇచ్చారు. యనకి హృదయపూర్వక కృతజ్ఞతలు. 18పేజస్ నుంచి అఖిల్ గారితో నాకు పరిచయం ఏర్పడింది. ఆయన చూసిన తర్వాత మరింత ఇన్స్పిరేషన్ వచ్చింది. ఆయన నాకు చాలా ఎంకరేజ్ చేశారు. ఈవెంట్ కొచ్చి మాకు సపోర్ట్ చేసిన నిఖిల్ అన్నకి థాంక్యూ సో మచ్’అన్నారు.
డిఓపి సతీష్ ముత్యాల మాట్లాడుతూ.. ఈ సినిమా అవకాశమిచ్చిన డైరెక్టర్ గారికి నిర్మాతలకు థాంక్యూ సో మచ్’అన్నారు.
ప్రొడ్యూసర్ జ్యోత్స్న మాట్లాడుతూ.. గంగాధర్ శాస్త్రి గారికి, చోటా కె నాయుడు గారికి, నిఖిల్ గారికి నమస్కారాలు. మా సినిమా కృష్ణ లీల నిజంగా ఒక అద్భుతం. ప్రతి ఒక్కరినీ జీవితంలో కనెక్ట్ చేసే పాయింట్స్ ఇందులో ఉంటాయి. ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుందని నమ్ముతున్నాము’అన్నారు
స్టోరీ రైటర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ సినిమా మేము అనుకున్నది కాదు. అది జరిగింది .లాయర్ గా ప్రాక్టీస్ చేశాను. ప్రేమ గురించైనా యుద్ధం గురించైనా పేరు చెప్పాలంటే కృష్ణుని పేరే చెప్తాం. కృష్ణుడు మొదట ప్రేమికుడు. ఎవరైతే కరెక్ట్ గా ప్రేమించగలరో అతనికి మించి యుద్ధం చేసేవాడు ఎవరు ఉండరు . దేవన్ చాలా డెడికేటెడ్ గా పని చేశాడు. మోషన్ పోస్టర్ నాకు చాలా నచ్చింది. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది’అన్నారు.
నటీనటులు: దేవన్, ధన్య బాలకృష్ణన్, వినోద్ కుమార్, పృధ్వి (పెళ్లి), రవి కాలే , తులసి, 7ఆర్ట్ సరయు, ఆనంద్ భరత్
సిబ్బంది:
దర్శకత్వం – దేవన్
నిర్మాత – జ్యోత్స్న జి
బ్యానర్: మహాసేన్ విజువల్స్
కథ & సంభాషణలు- అనిల్ కిరణ్ కుమార్ జి
డీవోపీ – సతీష్ ముత్యాల
సంగీతం – భీమ్స్ సిసిరోలియో
ఎడిటర్ – KSR
కొరియోగ్రఫీ -రఘు మాస్టర్
ఫైట్స్ – నందు మాస్టర్
ఆర్ట్ డైరెక్టర్ – రామకృష్ణ
పీఆర్వో: వంశీ-శేఖర్