Nikki Tamboli: నవ్వినా, ఏడ్చిన ట్రోల్ చేయడానికి ముందుంటారు: నిక్కి తంబోలి

బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి నిక్కి తంబోలి ఒకరు. బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా గుర్తింపు పొందిన ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు. ఇకపోతే గత కొద్దిరోజుల క్రితం జరిగిన ఓ సంఘటన గురించి నేటిజెన్లు పెద్ద ఎత్తున నటిపై దారుణమైన ట్రోలింగ్స్ చేస్తున్నారు. సింగర్‌ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సిద్ధూ మూసేవాలా మృతి చెందిన విషయం మనకు తెలిసిందే.

అయితే ఇతని మరణ వార్త విన్న తర్వాత నిక్కీ తంబోలి తట్టుకోలేక బోరుమని ఏడ్చేసింది.ఈ క్రమంలోనే ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు ఆమె ఏడుపు కేవలం నటన మాత్రమేనని అది నిజమైన బాధతో వచ్చిన ఏడుపు కాదు అంటూ తన బాధను వక్రీకరిస్తూ పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. సిద్ధూ మూసేవాలా పనితనం తనను ఎంతగానో ఆకట్టుకుంది అతని గురించి బిగ్ బాస్ కార్యక్రమంలో ఉన్నప్పుడు కూడా నేను ఎన్నోసార్లు ప్రస్తావించాను.

అయితే గత ఏడాది ఆయనను కెనడాలో ఒకసారి మాత్రమే కలిశాను అలాంటి ఆయన చనిపోయారని తెలియగానే కన్నీళ్లు వచ్చాయని అయితే ఈ ఏడుపును కూడా ట్రోల్ చేయడం బాధాకరం అంటూ ఈమె స్పందించారు. సాధారణంగా సెలబ్రిటీలు ఏ చిన్న పని చేసిన ట్రోల్ చేయడానికి ముందుంటారు. వాళ్లు నవ్వినా, ఏడ్చిన తిట్టడమే వాళ్ళ పనిగా భావిస్తూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంటారు.

అయితే ఇలాంటి విమర్శలు తనని బాధ పెట్టవని విమర్శలు రావడం మంచిదేనని, వాటి వల్ల తాను మరింత కష్టపడి పనిచేయాలని భావన తనలో కలుగుతుందని ఈ సందర్భంగా ఈమె తన గురించి వచ్చిన ట్రోల్స్ పై స్పందించారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus