“మిడిల్ క్లాస్ అబ్బాయి” పరమ రొటీన్ సినిమా, చాలా బోరింగ్ అంటూ సోషల్ మీడియాలో టాక్ వచ్చింది. అలాగే నెక్స్ట్ డే రిలీజైన “హలో” అదిరిపోయింది, చాలా అద్భుతమైన సినిమా అంటూ అదే సోషల్ మీడియాలో భీభత్సమైన పాజిటివ్ టాక్ వచ్చింది. సో ఈ సోషల్ మీడియా టాక్ ని బేస్ చేసుకొని ఏ సినిమా హిట్ అయ్యిందని గెస్ చేస్తారు. “హలో” సినిమానే కదా.. కానీ ఆ సినిమా కలెక్షన్స్ పరంగా డిజాస్టర్ అంటే నమ్మగలరా?. నమ్మకపోయినా అది నిజం. 15 కోట్ల రూపాయలతో తీసిన “మిడిల్ క్లాస్ అబ్బాయి” 35 కోట్ల రూపాయలు వసూలు చేయగా.. దాదాపు 25 కోట్ల రూపాయలతో తెరకెక్కించిన “హలో” మొత్తం కలిపి 15 కోట్లు కూడా కలెక్ట్ చేయకపోవడం గమనార్హం. అదే విధంగా డిసెంబర్ లో రిలీజైన “ఒక్క క్షణం” కూడా థ్రిల్లింగ్ హిట్, సూపర్ సస్పెన్స్ ఎంటర్ టైనర్ అంటూ అదే సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కట్ చేస్తే ఆ సినిమా కూడా కమర్షియల్ గా ఫెయిల్ అయ్యింది.
సో దీన్నిబట్టి అర్ధం చేసుకోవాల్సింది ఏంటంటే.. అక్కడ సోషల్ మీడియా టాక్, రివ్యూలు అనే వాటికి కలెక్షన్స్ కి ఏమాత్రం సంబంధం లేదని. సోషల్ మీడియాలో సినిమా హిట్ అయితే అది ఖచ్చితంగా కమర్షియల్ గా ఫ్లాపే. అదే విధంగా సోషల్ మీడియాలో ఏదైనా సినిమా ఫ్లాపైతే అది హిట్ అని కాదు కానీ ఫ్లాప్ కూడా కాదు అని. మరి ఈ విధమైన కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుందో తెలియదు కానీ.. ఇదే విధంగా కంటిన్యూ అయితే భవిష్యత్ లో జనాలు రివ్యూలు పట్టించుకోవడం మానేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.