Nithiin: ‘పవర్ పేట’ మూవీ ఆగిపోవడానికి అసలు కారణం అదేనట..!

ఈ ఏడాది నితిన్ నుండీ వచ్చిన ‘చెక్’ ‘రంగ్ దే’ చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్లో నితిన్ ఎంతో ఇష్టపడి చేసిన ‘చెక్’ మూవీ డిజాస్టర్ కాగా.. వెంకీ అట్లూరి డైరెక్షన్లో నితిన్ చేసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘రంగ్ దే’ మూవీ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. దీంతో నితిన్.. తర్వాత చేయబోయే సినిమాల పై జాగ్రత్త వహిస్తున్నాడు. ప్రస్తుతం మేర్లపాక గాంధీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘అంధాదున్’ రీమేక్ అయిన ‘మాస్ట్రో’ లో నటిస్తున్నాడు నితిన్.

ఇది పూర్తయ్యాక కృష్ణ చైతన్య డైరెక్షన్లో అతను పవర్ పేట అనే చిత్రంలో నటించాల్సి ఉంది. కానీ అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. దీనికి అసలు కారణం శర్వానంద్ మూవీ అని ఇన్సైడ్ టాక్. విషయంలోకి వెళితే.. శర్వానంద్ ప్రస్తుతం అజయ్ భూపతి డైరెక్షన్లో ‘మహాసముద్రం’ అనే మూవీ చేస్తున్నాడు. ఇందులో సిద్ధార్థ్ మరో హీరోగా నటిస్తున్నాడు. అయితే నితిన్- కృష్ణ చైతన్య ల కాంబినేషన్లో అనౌన్స్ చేసిన ‘పవర్ పేట’ చిత్రంలో హీరో సత్యదేవ్ కూడా ఎంపికైన సంగతి తెలిసిందే.

అంతేకాదు ‘మహాసముద్రం’ కథకి, ‘పవర్ పేట’ కథకి.. చాలా దగ్గర పోలికలున్నాయి అని తెలుస్తుంది. అదీ కాక… ‘పవర్ పేట’ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా రూపొందించాలని దర్శకుడు కృష్ణ చైతన్య ప్లాన్ చేశాడట. ‘ఈ కరోనా టైంలో ఒక సినిమా ఫినిష్ చెయ్యడం,దానిని విడుదల చేయడం కష్టంగా మారిన తరుణంలో.. ఒకే సినిమాని రెండు పార్టులుగా, అదీ.. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తే నష్టాలు తప్పవని’ నితిన్ ను అతని తండ్రి సుధాకర్ రెడ్డి హెచ్చరించారట. దీంతో ఈ ప్రాజెక్టుని నితిన్ పక్కన పెట్టినట్లు ఇన్సైడ్ టాక్.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus