తెలంగాణలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేసారు. అక్కడ కరోనా కేసులు తగ్గాయి అని అంటున్నారే కానీ… తగ్గలేదు అని ఇన్సైడ్ టాక్ నడుస్తుంది. తప్పుడు లెక్కలు చూపించి లాక్ డౌన్ ఎత్తేసారు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ఏపీలో నడుస్తున్న కర్ఫ్యూలు వచ్చే నెలలో ఎత్తేస్తే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది. ఇప్పటికే సినిమా థియేటర్లు కూడా ఓపెన్ అయ్యాయి. కానీ జనాల్లో కరోనా భయం పోయి… థియేటర్లకు రావడానికి కొంత సమయం పడుతుంది. అంతా కుదుటపడిన తర్వాతే కొత్త సినిమాలు విడుదలవుతాయి.
ఈ నేపథ్యంలో థియేటర్లలో తమ సినిమాలను విడుదల చేసుకోవాలని చాలా మంది హీరోలు భావిస్తున్నారు. కానీ నితిన్ ఆలోచన మాత్రం వేరేలా ఉంది. నితిన్- మేర్లపాక గాంధీ డైరెక్షన్లో ‘మాస్ట్రో’ మూవీ తెరకెక్కుతుంది. మొన్ననే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయింది. అయితే దీన్ని ఓటిటిలోనే విడుదల చేయాలని నితిన్ భావిస్తున్నాడట. ఆల్రెడీ ఈ సినిమాకి పలు ఓటిటి సంస్థల నుండీ మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే.. ‘మాస్ట్రో’ ని ఎందుకు ఓటిటిలోనే విడుదల చేయాలని నితిన్ భావిస్తున్నాడు అనే డిస్కషన్లు ఇప్పుడు మొదలయ్యాయి. నితిన్ ఓటిటి బాట పట్టాలనే ఆలోచనకి రావడానికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి.
అవేంటంటే.. థర్డ్ వేవ్ వస్తుందనే భయంలో ఇప్పుడు జనాలు ఉన్నారు. ఒకవేళ సినిమా విడుదలయ్యాక థర్డ్ వేవ్ వస్తే..మళ్ళీ థియేటర్లు మూత పడితే చాలా నష్టం వాటిల్లుతుంది. నితినే నిర్మాత కాబట్టి ఇది ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. రెండోడి ఇది ‘అంధాదున్’ రీమేక్. ఈ చిత్రాన్ని 3 ఏళ్ళ క్రితమే అందరూ చూసేసారు. ఇప్పుడు ధియేటర్లలో వస్తే చూస్తారన్న నమ్మకం చాలా తక్కువ. పైగా ఈ ఏడాది నితిన్ నుండీ వచ్చిన..’చెక్’ ‘రంగ్ దే’ చిత్రాలు ఆడలేదు.కాబట్టి ఇప్పుడు ‘మాస్ట్రో’ కి హైప్ తక్కువగా ఉంటుంది. అందుకే నితిన్ ఈ స్టెప్ తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది.