అసలైన సినిమాల పండుగ అంతా డిసెంబర్లోనే ఉందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఆ నెలలో ‘పుష్ప 2’ (Pushpa 2) ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) వంటి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయని.. అభిమానులు, సినీ ప్రేమికులు ఆశిస్తున్నారు. ముఖ్యంగా ‘పుష్ప 2’ డిసెంబర్ 6న విడుదల కావడం ఖాయమని చిత్ర బృందం చెప్పుకొస్తోంది. మొన్నటికి మొన్న నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్ (Y .Ravi Shankar).. “డిసెంబర్ 6న ఎట్టిపరిస్థితుల్లోనూ ‘పుష్ష 2’ రిలీజ్ అవుతుంది.సెప్టెంబరు 2 నాటికి ఫస్టాఫ్ ఎడిటింగ్ వెర్షన్ పూర్తవుతుంది, అక్టోబరు 6 కి సెకండాఫ్ కూడా రెడీ అయిపోతుంది.
Robinhood
నవంబరు 20కి ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. నవంబరు 25కి సెన్సార్ కూడా కంప్లీట్ చేస్తాం, అక్టోబరులో ఒక పాట, నవంబరులో ఇంకో పాట విడుదల చేయడానికి ప్లాన్ చేస్తాం. డిసెంబరు 5న ప్రీమియర్లు కూడా వేయాలని ప్లాన్ చేస్తున్నాం’ అంటూ చెప్పుకొచ్చారు. కానీ ‘అది జరిగేలా కనిపించడం లేదు’ అంటూ ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘పుష్ప 2’ షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం.. మరో 15 రోజులు షూటింగ్ చేయాల్సి ఉందట ‘పుష్ప 2’ టీం.
మధ్యలో ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) ఎపిసోడ్ కి కొంచెం ఎక్కువ టైం పట్టొచ్చట. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది. మరోపక్క ‘మైత్రి’ సంస్థ తమ ‘రాబిన్ హుడ్’ (Robinhood) సినిమాని కూడా డిసెంబర్లో విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ.. ‘పుష్ప 2’ కనుక పోస్ట్-పోన్ అయితే డిసెంబర్ 6కి ‘రాబిన్ హుడ్’ ని దింపాలని భావిస్తోందట ‘మైత్రి’ సంస్థ. అప్పుడు డిసెంబర్ 20 కి ‘గేమ్ ఛేంజర్’ వచ్చినా 2 వారాల పాటు తమ సినిమా రన్ కి ఇబ్బంది ఉండదు అనేది వారి అభిప్రాయం కావచ్చు.