Nivetha Pethuraj: ఓటీటీలో చందు మొండేటి సినిమా..!

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’ ఒరిజినల్ కంటెంట్ తో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తుంది. వెబ్ సిరీస్, సినిమాలతో సందడి చేస్తుంది. త్వరలోనే ప్రియమణి నటించిన ‘భామాకలాపం’ సినిమా ఆహాలో విడుదల కానుంది. ఇప్పుడు ఆహా కోసం మరో సినిమాను రెడీ చేస్తున్నారు. అదే ‘బ్లడీ మేరీ’. ‘మెంటల్ మదిలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నివేదా పేతురాజ్ ఈ సినిమా‏లో నటిస్తోంది. ఈ సినిమాతో నివేదా పేతురాజ్ తెలుగు ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది.

Click Here To Watch

ప్రముఖ ద‌ర్శకుడు చందు మొండేటి డిజిట‌ల్ మీడియా కోసం తెర‌కెక్కించిన తొలి ఒరిజిన‌ల్ సినిమా ఇది. ఈ వెబ్ ఒరిజిన‌ల్ నుంచి నివేదా పేతురాజ్ పాత్రను రివీల్ చేస్తూ ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్టర్ లో నివేదా లుక్ భ‌య‌పెట్టేలా ఇన్‌టెన్స్‌తో ఉంది. ‘TO THE BAD SHE IS BLOODY BAD’ అని పోస్టర్ పై క్యాప్షన్ ఇచ్చారు. వైక‌ల్యంతో ఇబ్బంది ప‌డుతున్నప్పటికీ త‌న స‌మ‌స్యల‌ను ధైర్యంగా ఎదుర్కొన‌గ‌లిగే అమ్మాయిగా నివేదా ఈ సినిమాలో నటించింది.

తన వారిని రక్షించుకోవడానికి ఎంత దూరమైన వెళ్లే అమ్మాయి కథే ఈ సినిమా. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై టి. జి. విశ్వ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మించారు. కిరిటీ దామరాజు, రాజ్ కుమార్ కసిరెడ్డి, బ్రహ్మాజీ, అజయ్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫర్ గా వ్యవహరించగా, కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం సమకూర్చారు. అతి త్వరలోనే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ సినిమాతో నివేదాకు ఎలాంటి గుర్తింపు వస్తుందో చూడాలి!

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus