నివేదా థామస్ కు ‘సూపర్’ ఛాన్స్..!
- April 9, 2019 / 03:00 PM ISTByFilmy Focus
సూపర్ స్టార్ రజినీ కాంత్ ఈమధ్య మరింత వేగంగా సినిమాలు చేస్తున్నారు. ‘కాలా’ వచ్చిన నాలుగు నెలలకే ‘2.0’ చిత్రాన్ని ఇచ్చేసాడు. ఇక ‘2.0’ వచ్చిన రెండు నెలలకే ‘పేట’ చిత్రాన్ని ఇచ్చేసారు. ఇక ‘పేట’ చిత్రం తరువాత రజినీకాంత్ తన 166 వ చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్లో చేయబోతున్న సంగతి తెలిసిందే.ఏప్రిల్ 10 నుండీ ఈ చిత్రం రెగ్యూలర్ షూటింగ్ మొదలుకానుందని సమాచారం. ఇక ఈ చిత్రంలో హిరోయిన్ గా లేడీ సూపర్ స్టార్ నయన తార నటించనుందని టాక్ నడుస్తుంది.
- మజిలీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- సూర్యకాంతం రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- ఫ్రేమకథా చిత్రం 2 రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
ఇక ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం నివేదా థామస్ ను తీసుకున్నారట.చిత్ర కథ ప్రకారం రజినీ కూతురుగా నివేదా ఈ చిత్రంలో కనిపించనుందని తెలుస్తుంది. ముంబై బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోయే ఈ చిత్రంలో రజినీ పోలీస్ ఆఫిసర్ గా కనిపిస్తారని తెలుస్తుంది. ఇక రజినీ ఫ్రెండ్ గా ఎస్ జె సూర్య కూడా నటించబోతున్నాడట. గతంలో వచ్చిన మురుగదాస్ ‘స్పైడర్’ చిత్రంలో కూడా విలన్ గా నటించాడు సూర్య. అనిరుద్ సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని ‘లైకా ప్రొడక్షన్స్’ సంస్థ నిర్మిస్తుంది. 2020 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు.














