‘కార్తికేయ 2 ‘ తో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు నిఖిల్ సిద్ధార్థ్. ఇప్పుడు మళ్ళీ మరో పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. అతను హీరోగా గ్యారీ బీహెచ్ దర్శకుడిగా పరిచయమవుతూ చేస్తున్న ‘స్పై’ మూవీ ఈడీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కె రాజశేఖర్ రెడ్డి నిర్మాణంలో రూపొందింది. ది గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ థీమ్ ఆధారంగా తెరకెక్కింది ఈ మూవీ.
రెండో ప్రపంచ యుద్ధంలో ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించి, లక్షలాది మంది సామాన్యులను సైనికులుగా తయారు చేసి వారిలో యుద్ధ స్పూర్తిని నింపారు సుభాష్ చంద్రబోస్. ఆ టైంలో అంటే 1945లో ప్లేన్ క్రాష్ అయ్యి ఆయన చనిపోయినట్లు చరిత్ర చెబుతుంది. కానీ అది కవరప్ స్టోరీ అని ‘స్పై’ ట్రైలర్లో చూపించారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఈ కథను అంతే ఉత్కంఠభరితంగా, ప్రేక్షకులకు గూజ్ బంప్స్ వచ్చేలా చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకులు గ్యారీ బీహెచ్.
అలాగే ఈ చిత్రానికి గ్యారీ బీహెచ్ ఎడిటర్ గా కూడా పనిచేశారు. ఇది వరకే (SPY) “స్పై” సినిమాకు సంబంధించిన టీజర్, పాట విడుదలై సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. ఇక తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ,కన్నడ భాషల్లో ఈ మూవీ ఏకకాలంలో విడుదల కాబోతోంది. శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్ లు ఈ చిత్రానికి సంగీతం అందించారు.
జూమ్ జూమ్ రే పాటకు సూపర్ రెస్పాన్స్ లభించింది.వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్ లు అందించిన విజువల్స్ కూడా టాప్ నాచ్ లో ఉంటాయని వినికిడి. ఇక శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకొని జూన్ 29న ఈ మూవీ విడుదల కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.