ఈ కరోనా వైరస్ కారణంగా జనాలందరూ ప్రస్తుతం ఇళ్ళల్లోనే ఉంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అని కొందరు, అసలు వర్క్ లేక ఇంకొందరు ఇళ్లకే పరిమితమవుతున్నారు. అందువల్ల ఆల్మోస్ట్ అందరూ కుదిరితే టీవీలకు లేదంటే ఆనలైన్ ప్లాట్ ఫార్మ్స్ కు అతుక్కుపోతున్నారు. ఆ కారణంగా నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, ఆహా వంటి అన్నీ యాప్స్ కు ట్రాఫిక్ దారుణంగా పెరిగిపోయింది.
అందువల్ల ఇంటర్నెట్ పై భారీ స్థాయిలో భారం పడడం మొదలైంది. అందులోనూ ఇప్పుడు ఇంటర్నెట్ సర్వీస్ హోల్డర్స్ అందరూ హైస్పీడ్ ఇంటర్నెట్ ను తక్కువ ధరకే అందిస్తుండడంతో.. అందరూ ఫుల్ హెచ్.డి లో సినిమాలు, వెబ్ సిరీస్ లు చూడడం మొదలెట్టారు. దాంతో ఇంటర్నెట్ యూసేజ్ విపరీతంగా పెరిగిపోయింది.భారత్ లో గత మూడు నెలల్లో వినియోగించిన ఇంటర్నెట్ కంటే గత 15 రోజుల్లో వినియోగించిన ఇంటర్నెట్ బాండ్ విత్ ఎక్కువంట.
దాంతో ఆన్లైన్ స్ట్రీమింగ్ యాప్స్ అన్నిటికీ ప్రభుత్వం ప్రస్తుతానికి హెచ్.డి కంటెంట్ ను ఆపివేయాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. ఆ కారణంగా కొన్నాళ్లపాటు నార్మల్ క్వాలిటీలోనే కంటెంట్ చూడాల్సి వస్తుంది. అందువల్ల డియర్ యూజర్స్ మీరందరూ కొన్నాళ్లపాటు ఎస్.డి క్వాలిటీలోనే సినిమాలు, వెబ్ సిరీస్ లు చూడండి. లేదంటే 4G ఇంటర్నెట్ ను షట్ డౌన్ చేసే అవకాశాలున్నాయి.
Most Recommended Video
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్