ప్రతి ఏడాది మే 28న సీనియర్ ఎన్టీయార్ వర్ధంతిని పురస్కరించుకొని “అన్నగారికి భారతరత్న ఇవ్వాలి” అని ఒకసారి గట్టిగా మైక్ ముందు అరవడం, విని చప్పట్లు కొట్టి “అవును మన అన్నగారికి ఇప్పటివరకూ భారతరత్న ఇవ్వలేదు కదా అని తెలుగోళ్ళు కూడా కాసేపు బాధపడి సైలెంట్ అయిపోవడం” సర్వసాధారణంగా జరిగే విషయం. అయితే.. మొన్న రాత్రి రాష్ట్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఒక్క సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అవార్డులు మినహా మిగతా వారందరూ పద్మ పురస్కారాలకు అర్హులే అని అందరూ స్వాగతించారు. కాకపోతే.. బాలీవుడ్ లో కంగనా రనౌత్, ఏక్తా కపూర్, కరణ్ జోహార్ వంటి వారికి పద్మ పురస్కారాలు ప్రకటించడం అనేది అందర్నీ ఆశ్చర్యపరిచింది. వీళ్ళకి పద్మ పురస్కారాలు లభించడం పట్ల బాలీవుడ్ జనాలు కూడా ఆనందంగా లేరు.
కానీ.. తెలుగులో ప్రఖ్యాత నటులు కైకాల సత్యనారాయణ గారిని పద్మ పురస్కారాల కమిటీ ఎందుకని కనీసం పరిగణలోకి తీసుకోలేదు అని చాలా మంది బాధపడ్డారు. లెజెండ్స్ భౌతికంగా మన మధ్య లేనప్పుడు అవార్డులు ఇచ్చి కంటితుడుపు చర్యలు చేపట్టడం కంటే.. వాళ్ళు మన మధ్య ఉన్నప్పుడే వాళ్ళని గౌరవించడం మన బాధ్యత. ఈ విషయాన్ని ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల పెద్దలు కాస్త సీరియస్ గా తీసుకొని కైకాల పేరును సిఫారసు చేస్తే బెటర్.
డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!